టీడీపీలోకి ఏపీ మాజీ మంత్రి

మొన్నటి ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ చిత్తయిపోవడంతో హస్తం పార్టీ నేతలు ఎవరిదారి వారు వెతుక్కుంటున్నారు. ఎన్నికలకు ముందే కొందరు సైకిలెక్కగా మరికొందరు ఫ్యాన్ గాలి కోసం వెళ్లారు. మిగిలిన వారు ఇప్పుడు దారి వెతుకుతున్నారు. ఇటీవల ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరగా…ఇప్పుడు మరో మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా నేత మహిధర్‌ రెడ్డి టీడీపీలో చేరుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈనెలలోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ కాస్త బలహీనంగా ఉండడంతో మహిధర్ రెడ్డి రాక వల్ల బలం పెరుగుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.