సీమ నేతలకు చిన్నమ్మ చికాకు

బీజేపీ ఏపీ అధ్యక్ష పదవికి త్వరలో కొత్త నేతను ఎన్నుకోనున్నారు. అయితే ఈసారి ఈ పదవి కోసం రాయలసీమ నేతలు తీవ్రంగా పట్టుపడుతున్నారు. ఇప్పటివరకు పదవులన్నీ ఆంధ్రాప్రాంతానికే దక్కాయని ఈసారైనా అధ్యక్ష పదవి సీమకు ఇవ్వాలని కోరుతున్నారు. ఇందుకోసం కొందరు ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే వీరి ప్రయత్నాలకు పురందేశ్వరి రూపంలో కొత్త ఇబ్బంది వచ్చిపడుతోంది. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసిన పురందేశ్వరి తాను రాయలసీమ నేతనే అంటున్నారట.

సీమకు అధ్యక్ష పదవి ఇవ్వాలంటూనే అది కూడా తనకు అవకాశం ఇస్తే బాగుంటుందని ఆమె కోరుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాన్ని రాయలసీమ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పోటీ చేసినంత మాత్రాన పురందేశ్వరి రాయలసీమవాసి ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. అసలు పురందేశ్వరిని రాయలసీమ ప్రజలు సొంతం చేసుకోలేదు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ఆమె ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు. పురందేశ్వరిని అధ్యక్ష పదవి ఇస్తే అది రాయలసీమ కోటా కిందకు రాదని.. అలాంటి ప్రచారం చేసి తమను మరింత ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నారు. ప్రస్తుతం సీమ కోటాలో బీజేపీ అధ్యక్ష పదవిని నరసింహారెడ్డి, సురేష్‌ రెడ్డి, శాంతారెడ్డి తదితరలు ఆశిస్తున్నారు. చూడాలి చిన్నమ్మ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో!.

Click to Read:

cpm-madhu

rayapati-sambasiva-rao

hero-suman