బ‌న్నీ మ‌హేష్ కు పోటి అవుతాడా ?

ఇండ‌స్ట్రీలో  క‌లెక్ష‌న్స్ ను బ‌ట్టే  ఆ యా హీరోల క‌మ‌ర్షియ‌ల్ రేంజ్ ను లెక్క వేయ‌డం  అనేది ప్ర‌స్తుతం న‌డుస్తున్న ట్రెండ్.  ప్ర‌భాస్ బాహుబ‌లి  చిత్రంతో  త‌న ఖాతాలో అన్ని రికార్డ్స్  వేసుకున్నాడు. అయితే  ఆ చిత్రం  రాజ‌మౌళి క్రెడిట్ లో వెళ్తుంది. క‌ట్ చేస్తే ఒక హీరో  స్టార్ డ‌మ్  ను సినిమా న‌వ‌వ‌డం అంటే అది వంద‌కు వంద శాతం  శ్రీ‌మంతుడే అని చెప్పాలి. ఒక సాధార‌ణ క‌థ‌.అర్ధ‌వంత‌మైన క‌థతో  ద‌ర్శ‌కుడు సినిమా చేయ‌డంతో  మ‌హేష్ స్టార్ డ‌మ్ తో  ఈ చిత్రం క‌లెక్ష‌న్ల ప‌రంగా  అద‌ర‌హో అనిపించింది.  దాదాపు 150 కోట్ల‌కు పైగా శ్రీ‌మంతుడు క‌లెక్ట్ చేసింది.

మ‌రి తెలుగులో ప్ర‌స్తుతం  మ‌హేష్ చిత్రంతో పోటి ప‌డి క‌లెక్ష‌న్స్ సాధించ‌గ‌ల హీరో ఎవ‌రు..?  బ‌న్నీ  అప్పుడే మ‌హేష్  కు పోటి  ఇవ్వ‌గ‌ల స్థాయికి రీచ్ అయ్యాడా..?    అల్లు అర్జున్ ఇప్పుడు టాప్ హీరో. కచ్చితంగా చెప్పాలంటే సూపర్ స్టార్ మహేష్ తో సమానమైన మార్కెట్ సాధించిన హీరో. దర్శకుడు బోయపాటితో కలిసి చేస్తున్న సరైనోడు సినిమా మార్కెట్ 70 కోట్ల మేరకు కనిపిస్తోంది. ఓవర్ సీస్, శాటిలైట్, తమిళ, కేరళ,కర్ణాటక, హిందీ డబ్బింగ్ కలిపి 70 కోట్లమేరకు మార్కెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నైజాం, ఈస్ట్ ఏరియాలు మినహా మిగిలినవన్నీ విక్రయించేందుకు చర్చలు సాగించేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర, సీడెడ్ తెలంగాణ కలిపే 45 కోట్ల వరకు టార్గెట్ పెట్టుకున్నట్లు వినికిడి.  బన్నీకి కేరళలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ వుండడం వల్ల 70 కోట్లు అన్నది సులువుగా సాధించే ఫిగర్ అయిపోయింది.

డెభ్బై కోట్లు మార్కెట్ అంటే, వసూళ్లు కనీసం 80 కోట్ల మేరకు వుండాలి. ఆపై లాభాలు అంటే సరైనోడుకు సరైన ఫిగర్ వంద కోట్లు అన్నమాట. అంటే ఆ ఫీట్ సాధించే హీరో మహేష్ తరువాత బన్నీయే అవుతాడు. మిగిలిన మెగా హీరోలందరూ ఇక ఆ వెనుకే. ఇటీవలే ఈసినిమాకు ప్రీలుక్ పోస్టర్, రిపబ్లిక్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తం మీద మ‌హేష్ కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటి  ఇచ్చే హీరోల లిస్ట్ లో  బ‌న్నీ నెంబ‌ర్ వ‌న్ లో వున్నాడ‌న్న‌మాట.