బాహుబ‌లి టీమ్ ఫ్లై టు అమెరికా..!

బాహుబలి ది కన్ క్లూజన్ (సెకండ్ పార్ట్) సెకండ్ షెడ్యూల్ కేరళలోని కన్నూర్ అడవుల్లో ముగిసింది. వారం రోజులకు పైగా సాగిన ఈ షెడ్యూల్ లో ప్రభాస్, అనుష్క, మరికొందరిపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. షార్ట్ బ్రేక్ తర్వాత ఈ సినిమా యూనిట్ అంతా ఇప్పుడు యూఎస్ బయల్దేరి వెళ్తుందని అంటున్నారు. ఈ చిత్రం ఫారిన్ వెళ్ళబోవడం ఇది రెండో సారి.

ఫస్ట్ పార్ట్ లో.. బల్గేరియాలోని కొండ ప్రాంతాల్లో కొన్ని సీన్స్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రెండో భాగంలో ఎటువంటి సీన్స్ షూట్ చేస్తారో సస్పెన్స్ గా ఉంది. సాధారణంగా తన ఈ సినిమా విశేషాలను ట్విటర్ ద్వారా తన ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు పంచుకునే దర్శకుడు రాజమౌళి ఈ సారి మాత్రం కామ్ గా ఉన్నాడు. ఇక బాహుబ‌లి ది బిగినింగ్ ఊహించిన దానికంటే ఘ‌న విజ‌యం సాధించ‌డంతో బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ ను అంత‌కు మించి ఉండేలా రాజ‌మౌళి కృషి చేస్తున్నాడు. ఇది నిజంగా ఒకింత ఆయ‌న‌కు మెంట‌ల్ గా ప్రెజ‌ర్ క్రియోట్ చేసే అంశ‌మే . అయితే త‌న పై అభిమానులు పెట్టుకున్న అంచ‌నాల్ని రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా ఇప్ప‌టి వ‌ర‌కు డిజ‌పాయింట్ చేయ‌లేదు.

Click on Image to Read

review-new

trisha-devil
samantha-ntr
Amrutha-Fadnavis-Singer
Victory-Venkatesh