ముఖ్యమంత్రి స‌తీమ‌ణి…సినీ గాయ‌ని!

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ స‌తీమ‌ణి అమృత ఫ‌డ్న‌విస్‌ హ‌ఠాత్తుగా బాలివుడ్ సినీ గాయ‌కురాలిగా మారిపోయారు. ప్రియాంక చోప్రా నాయ‌కురాలిగా ప్ర‌కాష్ ఝా తెర‌కెక్కిస్తున్న జై గంగాజ‌ల్ సినిమా కోసం అమృత పాట పాడారు. సినిమాలో ఈ పాట‌ని ప్ర‌కాష్ ఝాపైనే చిత్రీక‌రించ‌డం విశేషం. గంగాజ‌ల్ సినిమాలో ప్రియాంకా చోప్రా ఉన్న‌త పోలీసు అధికారిణిగా న‌టిస్తుండ‌గా ఆమెకు జూనియ‌ర్‌గా, డిప్యూటీ  సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ప్ర‌కాష్ న‌టిస్తున్నారు. ఆ పాత్ర స్వ‌భావం మారుతున్న క్ర‌మంలో ఈ పాట తెర‌పై వ‌స్తుంద‌ట‌. అమృత ఈ పాట‌తో పాటు ఫిర్‌సే అనే ప్రేమ‌క‌థా చిత్రంకోసం కూడా మ‌రొక పాట‌ని పాడారు. అమృత యాక్సిక్ బ్యాంక్‌లో ఉన్న‌త ప‌ద‌విలో ఉన్నారు. ఫ‌డ్న‌విస్ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి అయిన స‌మ‌యంలో, నాగ‌పూర్ బ్రాంచ్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేస్తున్న ఆమె ముంబ‌యికి మార‌తార‌ నే వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ముంబ‌యిలో ఆమె మ‌రో నూత‌న కెరీర్‌లోకి అడుగు పెట్టే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టుగా క‌న‌బ‌డుతోంది.