స‌మంత అంటే ఎన్టీఆర్  భ‌య ప‌డుతున్నాడా..?

టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో వరుస సూపర్ హిట్ లు సాధించిన ఎన్టీఆర్, నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన జూనియర్, ప్రస్తుతం ఆ సినిమాకు నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా మార్కెట్ రేంజ్ ను మరింత పెంచుకునేందు పరభాష నటులను ఎక్కువగా తీసుకుంటున్నాడు.
ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో పాటు, ఫహాద్ ఫాజిల్ ను కూడా ఈ సినిమాలో కీలక పాత్రలకు ఎంపిక చేశాడు. ఇద్దరు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నిత్యామీనన్ ను ఎంపిక చేయటంతో మాలీవుడ్ లో కూడా జనతా గ్యారేజ్ కు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఇక రెండో హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు.
ముందుగా లీడ్ హీరోయిన్ గా సమంతను ఫైనల్ చేసిన చిత్రయూనిట్, ఇప్పుడు మరోసారి ఆలోచనలో పడింది. గతంలో ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో బృందావనం, రామయ్యా వస్తావయ్య, రభస సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో బృందావనం ఒక్కటే మంచి టాక్ సొంతం చేసుకోగా మిగతా రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. అందుకే సమంతతో సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

Click on Image to Read

review-new

trisha-devil
Bahubali-Anushka
Amrutha-Fadnavis-Singer
Victory-Venkatesh