ఇంకో వంద కేసులు పెట్టుకోండి….

ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై దాడి కేసులో బెయిల్‌పై విడుదలైన రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రభుత్వం తీరుపై తీవ్రంగా స్పందించారు. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తాను దాడి చేసి ఉంటే సీసీ ఫుటేజ్ విజువల్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన సీసీ ఫుటేజ్‌లో తాను దాడి చేసినట్టు ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీసీ ఫుటేజ్‌ దృశ్యాల్లో ఏమీ లేదన్న సంగతి తమకూ తెలుసని పోలీసులే చెప్పారన్నారు. ఆ విజువల్స్‌ను కోర్టుకు కూడా సమర్పించలేదన్నారు.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజల పక్షానపోరాటం చేస్తూనే ఉంటామని మిథున్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు ఒక కేసు కాదు మరో వంద కేసులు పెట్టించినా భయపడేది లేదన్నారు. ఒక మహిళా తహసీల్దార్‌ను జుట్టుపట్టి లాగి ఒక ఎమ్మెల్యే కొడితే స్వయంగా పంచాయతీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ది ఆగపోవడానికి టీడీపీ ప్రభుత్వ అరాచకమే కారణమని మిథున్ రెడ్డి విమర్శించారు.

Click on image to Read

అమరావతి తొలి రెండు అంతస్తుల్లో నివాసం వద్దు- ఐరాస కన్సల్టెంట్

ycp-jammalamadugu

venkayya-naidu-new

మోదీ కుండలు చూసే నోరు మూసుకున్నా…

ఆ నిజాలు నాతోనే సమాధి అవుతాయి

 

kcr-pressmeet

lokesh-anasuya