దెయ్యంగా న‌టించ‌డం క‌ష్ట‌మే! త్రిష‌

ఏళ్లు గ‌డుస్తుంటే న‌టులు పాత‌బ‌డిపోతుంటారు. వారినే కొత్త త‌ర‌హా క‌థ‌ల్లో, పాత్ర‌ల్లో చూసిన‌ప్పుడు ప్రేక్ష‌కుడికి మ‌ళ్లీ ఫ్రెష్‌గా అనిపిస్తుంటారు. హీరోలుగా చెలామ‌ణి కాలేమ‌నుకున్న‌వారు విల‌న్లుగా రాణించ‌డం మ‌నం చూస్తున్నాం. అలాగే ఇప్ప‌టివ‌ర‌కు తెర‌పై ఆడుతూ పాడుతూ అందంగా క‌నిపించిన హీరోయిన్లు, జుట్లు విర‌బోసుకుని పెద్ద బొట్లు పెట్టుకుని క‌ళ్లలో నిప్పులు కురిపిస్తూ భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ఇలాంటి పాత్ర‌ల్లో కొంత‌మంది రాణించ‌గా ఇప్పుడు త్రిష, ఈ రోజు విడుద‌ల‌వుతున్న క‌ళావ‌తితో ఇదేవేషంలో మ‌నముందుకు వ‌స్తోంది. ఈ సినిమా రిలీజ్ కోసం తాను చాలా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న‌ట్టు త్రిష చెప్పింది.

ఇప్ప‌టివ‌రకు తాను చేయ‌ని ఒక విభిన్న పాత్ర‌ను ఇందులో చేశానంది. త‌మిళంలో అర‌ణ్మానై-2గా ఇది ప్రేక్ష‌కుల ముందుకు వెళుతోంది. దెయ్యంలా భ‌య‌పెట్ట‌డ‌మంటే అంత‌సులువేమీ కాద‌ని, అలా క‌నిపించేందుకు మేక‌ప్ విష‌యంలో చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌ని, చాలా స‌న్నివేశాల్లో క‌ళ్ల‌ను ఆర్ప‌కుండా న‌టించాల్సి ఉంటుంద‌ని, ఇదంతా చాలా క‌ష్ట‌మైన ప‌నే అని త్రిష పేర్కొంది. ఇందులో భ‌య‌పెట్టే దెయ్యం క‌థ‌తో పాటు అంద‌మైన ప్రేమ‌క‌థ కూడా ఉందంది. సిద్దార్థ‌ త‌న‌కు చాలా ఏళ్లుగా తెలుసున‌ని, అత‌ను త‌న‌కు మంచి స్నేహితుడ‌ని, తామిద్ద‌రి కెమిస్ట్రీ తెర‌పై బాగా పండింద‌ని త్రిష చెప్పింది. ఇంత‌కీ దెయ్యాలున్నాయ‌ని మీరు న‌మ్ముతారా…అంటే న‌మ్ముతానంది. ద‌క్షిణాదిన హార‌ర్ సినిమాలు బాగా ఆడుతున్నాయ‌ని, అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాన‌ని తెలిపింది. హార‌ర్ సినిమాలో ప్రేమ‌, కామెడీ, సెంటిమెంట్స్ అన్నింటినీ చొప్పించ‌వ‌చ్చ‌న్న త్రిష‌, ప్ర‌స్తుతం తాను మ‌రొక హార‌ర్ కామెడీ సినిమా నాయ‌కి చేస్తున్న‌ట్టుగా చెప్పింది. సి సుంద‌ర్‌తో ఇంత‌కుముందే తాను న‌టించాల్పి ఉండ‌గా, డేట్లు ఖాళీ లేక‌పోవ‌డంతో కుద‌ర‌లేద‌ని, సుంద‌ర్ ఈ స‌బ్జ‌క్టుతో వ‌చ్చిన‌పుడు క‌థ ఏంట‌ని కూడా అడ‌గ‌కుండా ఒప్పుకున్నాన‌ని త్రిష చెప్పింది. బ్యూటిఫుల్ స్మ‌యిల్‌గా అందాల‌పోటీలో నెగ్గి తెర‌పైకి వ‌చ్చిన త్రిష, ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు భ‌య‌పెడుతుందో చూడాలి.

Click on Image to Read

Amrutha-Fadnavis-Singer

Victory-Venkatesh