24 పాటలు 28న విడుదల

సూర్య-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 24. ఈ సినిమా పాటల్ని ఈనెల 28న విడుదల చేయాలని నిర్ణయించారు.  ఈ మేరకు మేకర్స్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. సైంటిఫిక్-థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్ విడుదలైన రోజు నుంచే ఈ సినిమాపై అందరికీ ఉత్సుకత పెరిగింది. ఈ అంచనాలకు పెంచే విధంగా ఏదో ఒక పోస్టర్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సూర్య…. 28న జరిగే ఆడియో ఫంక్షన్ తో సినిమా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించాలనుకుంటున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించాడు. సినిమా విడుద తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. తమిళనాడులో ఎన్నికలు ముగిసిన వెంటనే సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.