ఆ విష‌యంలో కోచ్లి  చాలా హ్యాపీగా ఉంద‌ట‌..!

కొంద‌రికి ప్ర‌తిభ వుంటుంది.  త్వ‌రగా వెలుగులోకి వ‌స్తుంది.  మ‌రి కొంద‌రికి  స‌మ‌యం ప‌డుతుంది. అటువంటి కోవ‌కు చెందిన  ఆల్ రౌండ‌ర్ బాలీవుడ్ న‌టి క‌ల్కి కోచ్లిన్. ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ తో   మ్యారేజ్ లైఫ్ బ్రేక‌ప్ అయిన త‌రువాత‌..  ఒంటరిగా ఉంటుంది.  యాక్టింగ్ తో పాటు  ర‌చ‌న వ్యాసంగం అన్నా కూడా కోచ్లికి మంచి ఆస‌క్తి.  మంచి క‌థ‌లు రావాలంటే  రైట‌ర్స్ కు ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వాల‌నేది త‌న వాద‌న‌. అలాగే ర‌చ‌యిత‌ల పారితోష‌కం  కూడా పెంచాల‌నేది త‌న స‌ల‌హా.    సెన్సార్ బోర్డ్ ప‌టిష్టంగా ఉంటేనే  యూత్ ఎటువంటి చిత్రాలు చూడాలి అనే విష‌యంలో ఒక క్లారిటీ ఉంటుంది అని తేల్చింది.  ప్ర‌స్తుతం  క‌ల్కి కొచ్లిన్..వెయిటింగ్,  మంత్ర‌, షైతాన్‌,  చిత్రాల్లో న‌టిస్తుంది.   త‌న‌దైన మార్క్ యాక్టింగ్ చూపే రోల్స్ ఈ చిత్రాల్లో ఉంటాయ‌ని చెప్పింది. ఫ్యూచ‌ర్లో మెగాఫోన్ ప‌ట్ట‌డానికి సిద్దం అవుతున్న‌ట్లు కూడా  హింట్ ఇస్తుంది మ‌రి.  బాలీవుడ్ లో త‌న‌కు వ‌స్తున్న రోల్స్ ప‌ట్ల   చాలా హ్యాపిగా ఉంద‌ని తెలిపింది ఈ వెర్స‌టైల్  యాక్ట‌రెస్.