ఎంటర్‌టైన్‌మెంట్‌లో రాజీపడని తెలుగు తమ్ముళ్లు

టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేవు. ఆదాయవనరులు కూడా పెరగడంతో వీలు చిక్కినప్పుడల్లా ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో మందు విందుతో సరిపెట్టుకోలేకపోతున్నారు. మధ్యలో మగువలను కూడా దించేశారు.

అన్నవరంలో జరిగిన సంఘటన మరువక ముందే మరోసారి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు, కైకరం ప్రాంతాలకు చెందిన తెలుగు దేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. కైకరం ప్రాంతంలోని ఓ అట్టల ఫ్యాక్టరీలో రాత్రి టీడీపీకి చెందిన తెలుగు యువత నాయకుడి ఆధ్వర్యంలో ఈ పార్టీ జరిపారు. తొలుత మందు, విందుతో సరిపెట్టుకోవాలనుకున్నారు. కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో లోటు ఉండకూడదనుకున్నారు. అప్పటికప్పుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మహిళా డ్యాన్సర్లను తీసుకొచ్చారు. రాత్రంతా గంతులేశారు. వారితో కలిసి అశ్లీల డ్యాన్సులు వేశారు.

టీడీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి, మాజీ సర్పంచ్‌, ప్రముఖ ప్రజాప్రతినిధి సోదరుడుతో పాటు కొందరు ముఖ్యమైన కార్యకర్తలను మాత్రమే ఈ పార్టీలోకి అనుమతించారు. అధికారంలో వున్నది మేమే ఇక మముల్ని ఎవరు ఏమీ చేయ లేరని అనుకున్నారో ఏమో ఇక మందు, విందు, అశ్లీల డ్యాన్సులతో రాత్రి పది గంటలనుంచి తెల్లవారేవరికి రెచ్చిపోయారు. అయితే సెల్‌ఫోన్ చేతిలో ఉండడంతో ఆపుకోలేక ఒక వ్యక్తి ఈ తంతునంతా రికార్డు చేశాడు. అది చివరకు మీడియాలో చేతిలో పడింది. దీంతో తమ్ముళ్లల తైతక్కల పార్టీ జిల్లాలో హాట్ టాఫిక్ అయింది.

టీడీపీ నేతలు వీలుచిక్కినప్పుడల్లా ఇలాంటి పార్టీలు చేస్తుంటారని చెబుతున్నారు. టీడీపీ నేతలు పదేపదే ఇలాంటి విషయాల్లో దొరికిపోతుండడంపై స్థానికులు సెటైర్లు కూడా వేస్తున్నారు.

download (1) download (2) download

Click on Image to Read:

jagan

sakshi1

peddireddy1

jagan-nellore

jagan1

mother-and-child

tdp-women

sakshi-tdp

cbn

peddireddy

vamsi

raj-takre

roja-padma

cbn-hotel

jagan anitha

roja-padma

ysrcp-mlas

jyothula-nehru

buggana

chandrababu-devansh

chandrababu

anitha