నేను జనాన్ని నమ్ముకున్నా… నాయకులను కాదు-జగన్

నెల్లూరు పర్యటనలో జగన్ కొన్ని ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు. నేతలు కొందరు పార్టీ వీడి వెళ్తున్న నేపథ్యంలో … తాను ఎంచుకున్న దారిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను పార్టీ పెట్టినప్పుడు కునుచూపు మేరలో 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీకి నేతలు కనిపించలేదన్నారు. ఆనాడు కూడా తాను భయపడలేదన్నారు. నాడు తాను, తన తల్లి విజయమ్మ మాత్రమే ప్రయాణం మొదలుపెట్టామని చెప్పారు.

సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి కేసులు పెట్టినా బెదిరిపోలేదన్నారు. నాడు ఇద్దరితో మొదలైన ప్రస్తానం నేడు 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు గెలిచే స్థాయికి చేరిందన్నారు. తాను అప్పుడు ఇప్పుడు ప్రజలు, భగవంతుడిని నమ్ముకునే రాజకీయం చేస్తున్నానని చెప్పారు. ఎప్పుడూ కూడా నేతలను నమ్మకుని రాజకీయం చేయలేదన్నారు. ఇలా అనడం ద్వారా కొందరు నేతలు వెళ్లినా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని జగన్‌ పరోక్షంగా స్పష్టం చేశారు.

మహిళలు, రైతులు, చివరకు విద్యార్థులను కూడా మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. నీచరాజకీయాలు చేస్తున్న చంద్రబాబుతో ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమన్నారు. నెల్లూరుజిల్లాకు చెందిన ఆనం విజయకుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన జగన్… ఇకపై విజయకుమార్ రెడ్డి వైసీపీ కుటుంబంలో సభ్యుడన్నారు. విజయకుమార్ రెడ్డికి తన గుండెల్లో చోటిస్తున్నానని జగన్ అన్నారు.

Click on Image to Read:

tdp-leaders

peddireddy1

jagan1

jagan

mother-and-child

tdp-women

sakshi-tdp

cbn

peddireddy

vamsi

raj-takre

roja-padma

cbn-hotel

jagan anitha

roja-padma

ysrcp-mlas

jyothula-nehru

buggana

chandrababu-devansh

chandrababu

anitha