పెద్దిరెడ్డి అసంతృప్తి పుకారేనా?

పబ్లిక్ అకౌంట్స్‌ కమిటీ పదవి కోసం వైసీపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆశించారని వార్తలొచ్చాయి. అయితే జగన్‌ మాత్రం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఎంపిక చేశారు. దీనిపై జ్యోతుల నెహ్రు గానీ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిగానీ అమర్నాథరెడ్డి గానీ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. అయితే ఓ వర్గం మీడియాలో మాత్రం వైసీపీలో పీఏసీ చిచ్చు రగిలిందని పెద్దిరెడ్డి, జ్యోతుల, అమర్నాథరెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారని రెండు రోజుల నుంచి కథనాలు వస్తున్నాయి. పీఏసీ అనేది గొప్ప పదవా?. దాన్ని తీసుకున్న వారు ప్రత్యక్ష రాజకీయాల్లో పదేపదే ఓడిపోతారని పెద్దిరెడ్డి చెప్పినట్టు ఒక పత్రిక బుధవారం రాసింది. అయితే…

పెద్దిరెడ్డి మాత్రం యథాతథంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడలో బుధవారం జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. హాజరవడమే కాదు…జగన్‌ పనితీరును మొచ్చుకున్నారు. జగన్‌ సీఎం అయితే వైఎస్‌ఆర్ సువర్ణయుగం వస్తుందని చెప్పారు. చంద్రబాబుపైనా మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోవస్తున్న కమిషన్లతో చంద్రబాబు అభివృద్ధి చెందుతున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై పెద్దిరెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ ఫిరాయించడమే కాకుండా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి వెళ్లామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు.

పీఏసీ పదవి రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారని వార్తలొస్తున్న వేళ పెద్ది రెడ్డి ఈ రేంజ్‌లో చంద్రబాబును తిట్టడం, జగన్‌ను ప్రశంసించడం బట్టి పెద్దిరెడ్డిపై మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని భావిస్తున్నారు.

Click on Image to Read:

tdp-leaders

jagan

jagan-nellore

jagan1

mother-and-child

tdp-women

sakshi-tdp

cbn

roja-padma

jagan anitha

ysrcp-mlas

buggana