విమానంలో జగన్‌తో సెల్ఫీల కోసం ఎగబడ్డ ఐఏఎస్‌లు ఎవరు?

ఇటీవల హైదరాబాద్‌ నుంచి తిరుపతికి విమానంలో జగన్‌ ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ఘటన గురంచి ఒక తెలుగు మీడియా సంస్థ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లున్న విమానంలో పలువురు ఏపీకి చెందిన ఐఏఎస్‌లు ఎక్కారట. కాసేపటికి అదే విమానంలో ప్రతిపక్ష నేత జగన్‌ కూడా ఎక్కారు.

జగన్‌ను చూడగానే ఐఏఎస్‌లు సంబరపడ్డారట. ప్రతిపక్ష నేత కావడంతో ఐఏఎస్‌లు తమ సీట్లలో నుంచి లేచి నమస్కారంచేశారట. అంతటితో ఆగకుండా ఐఏఎస్‌లు తమ సీట్ల నుంచి లేచి ముందు వరుసలో కూర్చున్న జగన్ వద్దకు వెళ్లి చర్చలు పెట్టారట. ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి జగన్‌ పక్కన కూర్చుని సెల్ఫీలు దిగారు. ఇలా వారి ప్రయాణం చాలా హుషారుగా సాగిందని టీడీపీ అనుకూల పత్రిక కథనం. అయితే అదే విమానంలో వెనుక వరుసలో ఇద్దరు మంత్రులు కూడా కూర్చున్నారు.

కానీ జగన్‌ను చూసిన ఆనందంలో ఐఏఎస్‌లు మంత్రులను పట్టించుకోలేదట. జగన్‌తో ఐఏఎస్‌లు సెల్ఫీలు దిగడంపై మంత్రులిద్దరకి కోపం వచ్చిందని సమాచారం. వెంటనే వారు విమానం దిగినవెంటనే వారు విజయవాడలోని సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారట. మంత్రులం మేం విమానంలో ఉన్నా ఐఏఎస్‌లు పట్టించుకోలేదని… జగన్‌ విషయంలో మాత్రం పోటీపడి చొరవచూపారని సీఎంవోకు అప్‌డేట్ ఇచ్చారని సదరు పత్రిక కథనం. అయితే జగన్‌తో సెల్ఫీలు దిగిన ఐఏఎస్‌లు ఎవరు?. ఆ సన్నివేషం చూసి రగిలిపోయిన మంత్రులెవరన్నది మాత్రం పత్రిక వెల్లడించలేదు.

Click on Image to Read:

tdp-leaders

peddireddy1

jagan-nellore

jagan1

tdp-women

sakshi-tdp

cbn

peddireddy

vamsi

raj-takre

roja-padma

cbn-hotel

jagan anitha

roja-padma

ysrcp-mlas

jyothula-nehru

buggana

chandrababu-devansh

chandrababu

anitha