విడుదలకు ఒక్క రోజు ముందు ఊపిరిపై కోర్టు కేసు

అవును…. సరిగ్గా విడుదలకు 24 గంటల టైం ఉందనగా ఊపిరి సినిమాపై కోర్టు కేసు పడినట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాపై తమిళనాడులో ఓ వ్యక్తి కేసు వేసినట్టు తెలుస్తోంది. ఫ్రెంచ్ లో వచ్చిన ది అన్ టచబుల్స్ అనే సినిమా ఆధారంగా ఊపిరి సినిమాను తెరకెక్కించారు. ఈ విషయాన్ని మేకర్స్ కూడా చాలాసార్లు ప్రకటించారు. అయితే ఆ సినిమా రీమేక్ రైట్స్ తన దగ్గర ఉన్నాయని, ఊపిరి టీం ఎలా వాడుకుంటుందని ప్రశ్నిస్తూ…. ఓ వ్యక్తి చెన్నై కోర్టులో కేసు వేశాడట. అయితే ఊపిరి టీం మాత్రం మరోలా వాదిస్తోంది. తమ సినిమా ఒరిజినల్ ఫ్రెంచ్ సినిమాకు రీమేక్ కాదని… కేవలం దాన్ని ప్రేరణగా తీసుకొని మాత్రమే తెరకెక్కించామని చెబుతున్నారు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకటి మాత్రం నిజం…. ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా విడుదల ఆగిపోతే కనుక నిర్మాతకు భారీ నష్టాలు తప్పవు. లాంగ్ రన్ లో సినిమా వసూళ్లపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది.