బ్లాక్‌మెయిల్‌ లీడర్లకు జగన్‌ హెచ్చరిక

జగన్‌ వయసులో చిన్నవాడు కావడం, పార్టీ పెట్టాక ఇంకా అధికారంలోకి రాకపోవడంతో చాలా మంది నేతలు దీన్ని అలుసుగా తీసుకుంటున్నారని చాలాకాలంగా అభిప్రాయం ఉంది. కొందరు సీనియర్లు, ఎమ్మెల్యేలు తాము కోరింది ఇవ్వకుంటే పార్టీ వీడివెళ్తామన్నట్టుగా బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలను లోలోపల నడుపుతున్నారని అభిప్రాయం. అలాంటివారికి టీడీపీ అనుకూల మీడియా కూడా సాయం చేస్తోందని అనుమానిస్తున్నారు. ఫలాన నేత పార్టీ వీడుతారని, ఫలాన నేత అసంతృప్తిగా ఉన్నారు వంటి వార్తలతో వైసీపీలో అలజడి రేపేందుకు ప్రయత్నం జరుగుతోందని పార్టీలో భావన. అయితే బుధవారం నెల్లూరులో జగన్‌ ప్రసంగం తర్వాత పార్టీ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

”నేను నాయకులను నమ్ముకుని రాజకీయాలు చేయడం లేదు… ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నా” అంటూ నెల్లూరు స్పీచ్‌లో జగన్ పలుమార్లు పదేపదే స్పష్టం చేశారు. పార్టీ పెట్టినప్పుడు తాను, తన తల్లి మాత్రమే ఉన్నామని గుర్తు చేశారు. ఈ రెండు వ్యాఖ్యల వెనుక చాలా లోతైన అర్థమే ఉందంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ వీడడం, మరికొందరు సీనియర్లు అప్పుడప్పుడు అలకపాన్ను ఎక్కడం వంటి పరిణామాల నేపథ్యంలో అలాంటి వారికి జగన క్లారిటీ ఇచ్చేశారని చెబుతున్నారు. తాను నాయకులను నమ్ముకోలేదని ప్రజలను నమ్ముకున్నానని చెప్పడం ద్వారా తనపై నేతల బ్లాక్‌మెయిల్ ఒత్తిళ్లు పనిచేయవని స్పష్టం చేసినట్టుగా భావిస్తున్నారు.

పార్టీ పెట్టినప్పుడు తాను, తన తల్లి మాత్రమే ఉన్నానని చెప్పడం ద్వారా..వైసీపీ ఏ కొందరి నాయకుల దయాదాక్షిణ్యాల మీద ఎదిగినది కాదని గుర్తు చేశారని భావిస్తున్నారు. ఇంకొందరు పార్టీ వీడి వెళ్లినా లెక్క చేయబోనని, ఒంటిరిగానైనా మరోసారి పోరాడేందుకు సిద్ధమని జగన్‌ స్పష్టం చేశారని అభిప్రాయపడుతున్నారు. కొందరు నాయకులు పార్టీ వీడివెళ్తుండడంపై ఈ మధ్య పార్టీ కేడర్‌ కూడా కొద్దిమేర ఆందోళనలో ఉంది. ఈనేపథ్యంలో జగన్‌ ఒక్కడు ఉంటే చాలు అన్న భరోసాను తన ప్రసంగం ద్వారా కార్యకర్తల్లో ప్రతిపక్ష నేత కల్పించారని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద నెల్లూరులో తన ప్రసంగం ద్వారా కార్యకర్తల్లో ధైర్యం నింపడంతో పాటు… నేతల బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు పార్టీలో పనిచేయవని జగన్‌ తేల్చిచెప్పినట్టు భావిస్తున్నారు.

Click on Image to Read:

roja-ramoji

NTR-Health-Scheme

kanaiah

tdp-kadapa

spy-reddy

sakshi1

venkaiah-rss

tdp-leaders

peddireddy1

jagan-nellore

jagan1

jagan

mother-and-child

tdp-women

sakshi-tdp

cbn

peddireddy