ఎన్టీఆర్‌ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ) బంద్‌

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలను ఆటంకం ఏర్పడనుంది. శుక్రవారం నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలను నిలిపివేస్తున్నట్టు ఆస్పత్రులు ప్రకటించాయి. రూ. 350 కోట్ల బకాయిలు చెల్లించే వరకు సేవలను నిలిపివేస్తున్నట్టు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 150 స్పెషాల్టీ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఎంఓయూ ప్రకారం బిల్లులు పంపిన వారంలో సొమ్ము చెల్లించాలని .. కానీ కొన్ని నెలలుగా చెల్లింపులు ఆగిపోయాయని ఆస్పత్రుల యాజమన్యాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. వైద్యసేవల నిలిపివేతపై మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రుల యాజమాన్యాలు హఠాత్తుగా నోటీసులు ఇచ్చాయని మంత్రి చెప్పారు. పరిస్థితి ఇంతదూరం వచ్చేదాక మంత్రి ఏం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Click on Image to Read:

roja-ramoji

jagan

tdp-kadapa

spy-reddy

sakshi1

venkaiah-rss

tdp-leaders

peddireddy1

jagan-nellore

jagan1

jagan

mother-and-child

tdp-women

sakshi-tdp

cbn

peddireddy