ఎస్పీవై రెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్

కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం కర్నూలు జిల్లా గడిముల మండలం ఉండుట్లలో జరిగిన జాతరలో పాల్గొన్న ఎస్పీవై రెడ్డి ఇంటికి తిరిగి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎండవేడికి అస్వస్థత చెందారని భావించారు. అనంతరం రక్తపోటు అధికమైంది. కాసేపటికి ఫిట్స్ వచ్చి శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు.

వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు గుర్తించారు. దీంతో వెంటనే అయనను రాత్రి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ తరలించారు. ఇటీవలే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయి చాలా రోజులు ఆస్పత్రిలోనే ఉన్నారు. కోలుకుని తిరిగి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇంతలోనే బ్రెయిల్ స్ట్రోక్ రావడం కుటుంబసభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. పలుమార్లు ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే ఎంపీగా ప్రమాణస్వీకారం కూడా చేయకముందే టీడీపీలో చేరిపోయారు.

Click on Image to Read:

roja-ramoji

NTR-Health-Scheme

kanaiah

jagan

tdp-kadapa

sakshi1

venkaiah-rss

tdp-leaders

peddireddy1

jagan-nellore

jagan1

jagan

mother-and-child

tdp-women

sakshi-tdp

cbn

peddireddy