కాజ‌ల్ దేవుడికే రివ‌ర్స్ గేర్ చూపిస్తుంది..!

రోటిన్ గా వెళ్తే ఎక్క‌డ గుర్తింపు రాదు. అందుకే కాజ‌ల్ దేవుడి విష‌యంలో కూడా రివ‌ర్స్ గేర్ లో చెప్తుంది. ఎవ‌రైన దేవుడంటే త‌మ‌కు ఎంతో ఇష్ట‌మ‌ని చెబుతారు. కానీ కాజ‌ల్ మాత్రం దేవుడికి తనంటే ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చింది. దీనికి ఒక వివ‌ర‌ణ కూడా ఇచ్చింది.

త‌నకు చిన్న‌ప్ప‌టి నుంచి క‌ష్టం అంటే ఏమిటో తెలియ‌కుండా పెరిగింద‌ట. కోరుకున్న వాటితో పాటు.. కోరుకోనివి కూడా దేవుడిచ్చాడ‌ట‌. ఆడుకోవ‌డానికి ఒక మంచి చెల్లిని.. అలాగే సినిమాల‌తో కీర్తీ, ధ‌నం ఇచ్చాడు. ఇక్క‌డ పోటి ఎక్కువుగా ఉన్న‌ప్ప‌టికి నిల‌బ‌డే శ‌క్తినిచ్చాడంటూ క్లారీటి ఇచ్చింది. ప్ర‌స్తుతం కాజ‌ల్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం లో న‌టించింది. ప‌వ‌ర్ స్టార్ తో మొద‌టి సారి న‌టించింది. ఉగాది పండ‌గ రోజు న ఈ చిత్రం తెలుగు, హింది లాంగ్వేజెస్ లో రిలీజ్ కు స‌న్నాహం చేస్తున్నారు…! మొత్తం మీద కాజ‌ల్ తన లైఫ్ ఎంతో పాజిటివ్ గా ఉంద‌ని చెప్ప‌డానికి దేవుడి విష‌యంలో చెప్పిన మాట ఒక ఎగ్జాంపుల్ అనుకోవ‌చ్చు మ‌రి.!