ప్రధాన న్యాయమూర్తిపైకి దూసుకెళ్లిన వీహెచ్

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ వి. హనుమంతరావు సహనం కోల్పోయారు. ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైకే దూసుకెళ్లారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావును తొలగించాలంటూ వీహెచ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఏ నిబంధన కింద వీసీని తొలగించాలో చెప్పాలంటూ న్యాయస్థానం పిటిషనర్‌ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే కోర్టులోనే ఉన్న వీహెచ్‌ ఈసమయంలో ఆగ్రహానికి లోనయ్యారు. గట్టిగా అరుస్తూ జడ్జి పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఈ పరిణామంతో కోర్టులో వారంతా షాక్ అయ్యారు. తాను ఎంపీని అంటూ న్యాయమూర్తి ముందు వీహెచ్‌ హల్‌ చల్ చేశారు . వీహెచ్‌ తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్‌ ది పోలీస్ అంటూ ఆదేశించారు. అయితే ఇంతలోనే అక్కడున్న లాయర్లు వీహెచ్‌కు నచ్చజెప్పి బయటకు తీసుకెళ్లారు. వీహెచ్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేశారు.

Click on Image to Read:

puri

Chiru-150-Movie,-Appearance

tdp-leaders

YS-Jagan

anushka

kcr

dk-aruna

roja-comments

devineni-uma

mudragada-padmanabham-cbn

tdp-logo

chandrabu

ganta-srinivas-rao

jagan-yv-subbareddy

ysrcp-president

nallapureddy-prasanna-kumar

chandrababu