నేను కోట్లకు అమ్ముడుపోయే రకం కాదు

JANKE-VENKATA-REDDYవైసీపీని వీడి వెళ్లేది లేదంటున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి.  తాను కోట్లకు అమ్ముడుపోయే రకం కాదన్నారాయన. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వెంకటరెడ్డి విమర్శించారు.  కరువు విలయతాండవం చేస్తుంటే  చంద్రబాబు మాత్రం   కనీసం మంచినీళ్లు ఇచ్చే ఆలోచన కూడా చేయడం లేదని మండిపడ్డారు. చంద్రబాబుకు ఓటేందుకు వేశామా అని పేదలు నిత్యం బాధపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన నిధులు పక్కదారి మళ్లించడంతో కనీసం బోర్లు ఎండిన చోట మరమ్మతులు చేయించే పరిస్థితులు కూడా లేవన్నారు. ఎన్నికల హామీలు మరిచి ప్రత్యేక విమానాల్లో ఇతర దేశాలు తిరుగుతూ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం సుభిక్షంగా,   రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే జగన్‌ సీఎం కావాలన్నారు.

వెంకటరెడ్డి పొలాలను ఇటీవల ఒంగోలుకు చెందిన పార్టీ  ముఖ్యనేత ఒకరు  అప్పుల జమాలో భాగంగా వెంకటరెడ్డి పొలాన్ని రాయించుకున్నట్టు వార్తలొచ్చాయి. దీంతో ఆర్థిక  ఇబ్బందుల్లో ఉన్న వెంకటరెడ్డి పార్టీ వీడుతారంటూ ప్రచారం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న  జగన్‌… సదరు ముఖ్య నేత నుంచి వెంకటరెడ్డి పొలాన్ని విడిపించారని పార్టీ నేతలు చెబుతుంటారు.

Click on Image to Read:

kodali-nani-comments

heritate

narayana

cbn-narayana

mla-jaleel-khan

cbn-cabinet

vh

tdp-leaders

YS-Jagan