కుండలకు రెండు వేలు… పబ్లిసిటీకి పదివేలు

కరువు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో తాగేందుకు నీరు కూడా లేక జనం అలమటిస్తుంటే చంద్రబాబు మాత్రం మజ్జిగ సరఫరాకు జిల్లాకు మూడు కోట్లు అంటూ పనికి రాని చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీసుకుంటున్న చర్యల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. గుడివాడ చలివేంద్రంలో కుండలు, గ్లాసుల కోసం రెండు వేలు ఖర్చు చేసిన ప్రభుత్వం చలివేంద్రం చుట్టూ చంద్రబాబు ఫ్లెక్సీలు పెట్టేందుకు పదివేల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. కరువు నివారణ, తాగు నీటి సమస్య పరిష్కారం కోసం శాశ్వాత చర్యలు తీసుకోవడం మానేసి ఇలా చిల్లర పనులతో చంద్రబాబు కాలం వెల్లదీస్తున్నారని కొడాలి నాని విమర్శించారు.

Click on Image to Read:

heritate

janke venkata reddy

narayana

cbn-narayana

mla-jaleel-khan

cbn-cabinet

vh

tdp-leaders

YS-Jagan