అరె…. షారూక్ ను అసహనం ఇంకా వీడలేదు

అప్పుడెప్పుడో ఇన్ టోలరెన్స్ (అసహనం)పై కామెంట్స్ చేశాడు షారూక్. ఆ ఎఫెక్ట్ అతడి గత చిత్రం దిల్ వాలేపై బాగానే పడింది. థియేటర్లపై రాళ్లు పడ్డమే కాదు… సినిమా వసూళ్లు కూడా దారుణంగా పడిపోయాయి. బాలీవుడ్ లో ఏ సినిమా అయినా వారం రోజులే కాబట్టి… షారూక్ సినిమా కూడా ఎబోవ్ యావరేజ్ టాక్ తో గట్టెక్కింది. అసహనంపై వ్యాఖ్యలుచేసిన షారూక్… దిల్ వాలేతో బాగానే మూల్యం చెల్లించుకున్నాడు. అయితే అప్పటితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయిందని షారూక్ అనుకున్నాడు. ఆల్ ఈజ్ వెల్ అంతా తనకు తాను సర్దిచెప్పుకున్నాడు. కానీ అసహనం దెబ్బ కింగ్ ఖాన్ ను ఇంకా వెంటాడుతూనే ఉంది. అందుకు బలమైన సాక్ష్యాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా విడుదలైన షారూక్ చిత్రం ఫ్యాన్ కు వసూళ్లు బాగా తగ్గిపోయాయి. సినిమా బాగుందని అంతా అంటున్నారు .కానీ థియేటర్లకు మాత్రం ఎవరూ వెళ్లడం లేదు. కారణం ఏంటని ఆరాతీస్తే అసహనం అని తేలింది. అప్పుడు చేసిన కామెంట్స్ కు షారూక్ ఇంకా అనుభవిస్తూనే ఉన్నాడు. ఉత్తరాదిన చాలా థియేటర్లలో ఫ్యాన్ సినిమాకు కలెక్షన్లు పడిపోయాయి. 3 రోజుల వీకెండ్ వసూళ్లు లెక్కకట్టి చూస్తే… షారూక్ స్టామినా ఇంతేనా అనిపించేలా ఉన్నాయి. సో… బాలీవుడ్ బాద్ షాను ఈ అసహనం ఇంకెన్నాళ్లు వెంటాడుతుందో చూడాలి.