హ‌రీశ్‌, క‌విత‌ వార్తలు ఫాలో కారా?

121
మ‌హారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంక‌జా ముండే

ఇటీవ‌ల క‌రువుతో అల్లాడుతున్న లాథూర్ నేల‌లో చిరున‌వ్వులు చిందిస్తూ.. సెల్ఫీ తీసుకుని మ‌హారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంక‌జా ముండే వివాదంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే! ఈ ప‌రిణామంతో మ‌హారాష్ట్రలో ప్ర‌తిప‌క్షాలు మంత్రి తీరుపై భ‌గ్గుమ‌న్నాయి. ముఖ్యంగా శివ‌సేన అధికార బీజేపీపై మండిప‌డింది. దీంతో బీజేపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. ఈ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే.. మ‌రో మంత్రి, ఓ ఎంపీ ఇలాంటి చిక్కుల్లో ప‌డ్డారు.

తెలంగాణ భారీ నీటిపారుద‌ల మంత్రి హ‌రీశ్ రావు, నిజామాబాద్ ఎంపీ క‌విత  ఓ ఎండిపోయిన కాల్వ వ‌ద్ద సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఇది తీవ్ర  విమ‌ర్శ‌ల‌కు దారి తీసే అవ‌కాశ‌ముంది. కరీంన‌గ‌ర్ జిల్లా మెట్‌ప‌ల్లిలో జ‌రిగిన మార్కెట్ యార్డు క‌మిటీ స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారానికి వీరిద్ద‌రూ హాజ‌ర‌య్యారు. కార్య‌క్ర‌మం అనంత‌రం ఓ ఎండిపోయిన కాలువ వ‌ద్ద మంత్రి హ‌రీశ్ రావు, నిజామాబాద్ ఎంపీ క‌విత న‌వ్వుతూ సెల్ఫీ దిగారు. మ‌రీ, లాథూర్ అంత కాక‌పోయినా.. తెలంగాణ‌లోనూ క‌ర‌వు తాండ‌విస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బాధ్య‌త‌గ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు ఇలాంటి ఫొటోలు దిగ‌డం, వాటిని ప‌త్రిక‌ల‌కు విడుద‌ల చేయ‌డంపై ప‌లువురు మండిప‌డుతున్నారు. మ‌హారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంక‌జా ముండే సెల్ఫీ పెనువివాదం సృష్టించిన తరువాత కూడా హరిశ్ కవిత ఇలా సెల్ఫీలు దిగడం చర్చనీయాంశమైంది. బహుశా పంకజా ముండే సెల్ఫీ వివాదం గురించి వీరికి తెలియదు కాబోలు.
Click on Image to Read:
raventh-reddy