స్పాట్ ఫిక్స్ చేసిన మహేష్ బాబు

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమా చేశాడు మహేష్ బాబు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఎప్పుడనే అంశంపై నిన్నమొన్నటి వరకు చాలా వ్యవహారం నడిచింది. అయితే ఈమధ్యే ఆడియో విడుదల తేదీని ఖరారు చేశారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ రోజున సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే ఆడియో రిలీజ్ కు సరిగ్గా 24 గంటల ముందే సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశాడు మహేష్. ఈనెల 20న బ్రహ్మోత్సవం తేదీని థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

నిజానికి ఈనెల 20తో పాటు 27వ తేదీని కూడా పరిశీలించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది కాబట్టి 27వ తేదీని ఫిక్స్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావించారు. కానీ మహేష్ మాత్రం 20వ తేదీనే ఫిక్స్ చేయమని సూచించాడట. ఆ తేదీకంటే వారం రోజుల ముందే సినిమాను పూర్తిచేసేలా సహకరిస్తానని మాటిచ్చాడట. అలా 20వ తేదీ ఫిక్స్ అయింది. అయితే ప్రచారానికి యూనిట్  ఎంత టైం కేటాయిస్తుందనేది డౌట్.