బాబును సీఎం చేయడానికి, ఎన్టీఆర్ పై కుట్ర చేసింది కేసీఆరే

టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి మ‌రోసారి త‌న నోటికి ప‌నికి చెప్పారు. పాలేరు ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలపై దుమ్మెత్తిపోస్తూ కేటీఆర్ రాసిన బహిరంగ లేఖపై మండిపడ్డారు . అయితే తిడుతున్నది చంద్రబాబునా, లేక కేసీఆర్ నా అన్న అనుమానం కలిగేలా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి దించేసిన సంఘటనను గుర్తు చేస్తూ దానికి కేసీఆర్ తో లింక్ పెట్టారు.

 ”ఎన్టీఆర్ ను పదవి నుంచి దించి చంద్రబాబును నాయుడుని అధికారంలోకి తేవడం లో కుట్ర చేసింది, ఆ తర్వాత లబ్ధి పొందింది నీ తండ్రి కేసీఆరే” నంటూ ఆశ్చర్యకరమైన కామెంట్ చేశారు. ”అలా దించేయడం వల్లే అప్పటి వరకు మంత్రి కానీ నీ తండ్రికి మంత్రి పదవి వచ్చింది అది నిజమో కాదో వెళ్లి మీ నాన్ననే అడుగు” అంటూ కేటీఆర్ పై రేవంత్ విరుచుకుపడ్డారు.  సిగ్గుండాలి,  తోక కత్తిరిస్తాం అంటూ కేటీఆర్ పై తీవ్రవ్యాఖ్యలు చేశారు. అంటే ఎన్టీఆర్ ను దించేయడం కుట్రలో భాగంగా జరిగిందేనని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ భావిస్తున్నారన్న మాట. కేసీఆర్ మంత్రి పదవి పొంది ఉంటే చంద్రబాబు ఏకంగా ముఖ్యమంత్రి పదవినే పొందారు కదా!.

మరో కీలక విమర్శను కూడా రేవంత్ చేశారు. ”అమరావతికి వెళ్లి చంద్రబాబుతో కలిసి బిర్యానిలు తింటారు. కసీఆర్ చేసే యాగాలకు ఆప్యాయంగా కలుసుకుంటారు. బతకమ్మ పండగకు  వైఎస్ భారతిని కవితమ్మ పిలుస్తారు. మీరు,మీరు కలిసి  రాసుకుపూసుకు తిరుగుతారు. మధ్యలో మమ్మల్ని తెలంగాణ ద్రోహులంటారా” అని నిలదీశారు. ఈ విమర్శ కూడా కేసీఆర్ ను తిడుతున్నట్టుగా లేదు… చంద్రబాబు తీరునే తప్పుపడుతున్నట్టుగా ఉంది.   కేసీఆర్, చంద్రబాబు రాసుకుపూసుకు తిరుగుతుంటే మధ్యలో తాను కష్టాలు పడాల్సి వస్తోందని రేవంత్ ఆవేదన చెందుతున్నట్టుగా ఉంది.

 మాన‌వీయ‌ కోణంలో ఆలోచించి పాలేరు ఉప ఎన్నిక‌ బరి నుంచి త‌మ పార్టీ త‌ప్పుకుంద‌ని రేవంత్ చెప్పారు.  అంతేకానీ ఓట‌మికి భ‌య‌ప‌డి కాద‌ని అన్నారు. తాము ఎప్పుడైనా ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తామ‌ని, రేపు గులాబీ పార్టీలో దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఎవ‌రైనా చ‌నిపోయినా.. సైకిల్ పార్టీ పోటీకి నిల‌బ‌డ‌ద‌ని పేర్కొన్నారు.

click to read-

katamaneni-bhaskar

gattu-srikanth-reddy

devi-reddy-death-case

ganta-srinivas-rao

chandrababu-pulivendula

upasana-reaction

defection-mlas

paritala-sriram-new