టీడీపీలో మిగిలేది ఆయ‌నొక్క‌డే!

ఒకే ఒక్క‌డు.. వివాదాస్ప‌ద నేత‌.. ఓటుకు నోటు కేసులో ప్ర‌ధాన నిందితుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఒక్కడే టీడిపి పార్టీలో మిగిలేలా క‌న‌బ‌డుతున్నాడు. ఇప్ప‌టికే టీడీపీ శాస‌న‌స‌భా ప‌క్షం టీఆర్ ఎస్‌లో విలీన‌మైన వేళ‌.. ఆ పార్టీకి మ‌రో ఎదురు దెబ్బ పొంచి ఉంది. పార్టీ రాష్ట్ర శాఖ‌నుసైతం త్వ‌ర‌లోనే గులాబీపార్టీలోనే విలీనం చేయ‌నున్నార‌న్న వార్త‌లు ఆపార్టీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. ఇదే నిజ‌మైతే.. 3 ద‌శాబ్దాలుగా తెలంగాణ‌లో సత్తా చాటిన టీడీపీ ఇక తుడిచి పెట్టుకుపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ మేర‌కు పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌తోపాటు, మరో ఐదారుగురు జిల్లా అధ్యక్షులంతా క‌లిసి ఎన్నిక‌ల సంఘానికి లేఖ ఇవ్వ‌నున్నార‌న్న ప్ర‌చారం తెలుగు రాష్ర్టాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. తెలంగాణ‌లో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేల‌లో 12 మంది ఇప్ప‌టికే కారెక్కారు. మిగిలిన ముగ్గురిలో ఆర్‌.కృష్ట‌య్య పార్టీకి దూరంగా ఉంటున్నాడు. ఇక మిగిలింది ఇద్ద‌రు సండ్ర వెంక‌ట వీర‌య్య‌, రేవంత్ రెడ్డి. వీరిలో సండ్ర కూడా కారెక్కేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడ‌ని తెలిసింది. దీంతో రేవంత్ ఏకాకి అవుతాడ‌న్న చ‌ర్చ‌ అప్పుడే ఊపందుకుంది. ఒక‌వేళ మొత్తం పార్టీ విలీనాన్ని ఎన్నిక‌ల సంఘం ఆమోదిస్తే.. రేవంత్ త‌న‌ది ఏ పార్టీ అనిచెప్పుకుంటాడు? అన్న విష‌యం ఆస‌క్తి రేపుతోంది.

ఓటుకు నోటు కేసుతోనే..!

మొద‌టి నుంచి రేవంత్ దూకుడున్న యువ‌నేత‌గా చ‌క్క‌టి గుర్తింపు పొందాడు. కానీ, ఓటుకు నోటు కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఆయనపై ప‌డ్డ నింద‌.. అత‌ని రాజ‌కీయ భ‌విష్య‌త్తును తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. ఈ కేసులో సూత్ర‌ధారిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పార్టీ అధినేత చంద్ర‌బాబు దాదాపుగా తెలంగాణ‌లో క‌నుమ‌రుగయ్యాడు. తెలంగాణ‌లో పార్టీ ఎమ్మెల్యేలు కారు పార్టీలో విలీన‌మైన ఒక మాట కూడా అన‌లేదంటే.. ఆయ‌న ద‌య‌నీయ ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. చంద్ర‌బాబు మౌనంగా ఉన్నా రేవంత్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. స‌హ‌జంగానే టీడీపికి ఉన్న బ‌ల‌మైన మీడియా స‌హ‌కారం వ‌ల్ల నిత్యం వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నాడు. కేసులో జైలుకు వెళ్లి వ‌చ్చిన త‌రువాత రేవంత్ తీరు మ‌రీ ఉగ్ర‌రూపంగా మారింద‌ని చెప్పాలి. రాజ‌కీయ ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న ఏనాడో మ‌ర్చిపోయాడ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. త‌న‌ను అరెస్టు చేయించిన సీఎం కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు, దూష‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నాడు. ప్రెస్ మీట్ పెడితే.. సీఎంను ల‌క్ష్యంగా చేసుకుని తిట్ల‌దండ‌కం అందుకుంటున్నాడే త‌ప్ప‌.. నిర్మాణాత్మ‌క‌మైన సూచ‌న‌లు, ఆరోప‌ణ‌లు చేసి చాలాకాల‌మైంది. ఇప్ప‌టికే పార్టీకి దెబ్బ మీద దెబ్బ‌లు త‌గులుతోంటే.. తాజా ఉప‌ద్ర‌వం పార్టీని తాకితే.. టీడీపీ నేత రేవంత్ తాను ఏ పార్టీ అని చెప్పుకుంటాడు? అన్న చ‌ర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Click on Image to Read:

tdp-lokesh

Gutha-Sukender-Reddy

 

speaker-kodela

ap-capital-city

mahanadu-2016

godavari-stamped-report

Kancha-Illiah

tdp-chittor

vishal

570 cror containor

DS

chandrababu

vijayawada-corporaters

heritage

chandrababu-cm

tdp-rajyasabha-elections