మహేష్ మార్కెట్ వాల్యూ ఎంత?

సినిమా హిట్టయిన ప్రతిసారి తన పారితోషికం పెంచడం మహేష్ కు అలవాటే. సేమ్ టైం… మహేష్ మార్కెట్ కూడా పెరుగుతుంటుంది. శ్రీమంతుడు సక్సెస్ తో బ్రహ్మోత్సవంకు దాదాపు 30శాతం మార్కెట్ పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. అంతెందుకు… ఓవర్సీస్ రైట్సే… దాదాపు కోటికి పైగా పెరిగిపోయింది. శ్రీమంతుడు సినిమాను జీ-తెలుగు ఛానెల్ దక్కించుకుంది. అప్పట్లో ఆ సినిమాను 10కోట్ల రూపాయలకు దక్కించుకుంది. తాజాగా బ్రహ్మోత్సవం మూవీ శాటిటైల్ రైట్స్ ను కూడా జీ-తెలుగు ఛానెలే దక్కించుకుంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా రైట్స్ తీసుకున్నప్పటికీ… అదనంగా కోటి పెట్టాల్సి వచ్చింది. అవును… శ్రీమంతుడుకు 10కోట్లు పెట్టిన సదరు ఛానెల్… బ్రహ్మోత్సవాన్ని మాత్రం 11కోట్ల 20లక్షల రూపాయలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. కేవలం శాటిలైట్ రైట్స్ మాత్రమే కాదు… అన్ని ఏరియాల్లో మహేష్ మార్కెట్ ఇదే రేంజ్ లో పెరిగిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆంధ్రా, నైజాంతో పాటు ఓవర్సీస్ లోకూడా బ్రహ్మోత్సవం హక్కుల కోసం బయ్యర్లు దాదాపు 30శాతం అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. మరి ఆ మేరకు లాభాలు వస్తాయా అనేది చూడాలి.