బాబుతో పని పూర్తిచేసిన బంగారం

ఇక్కడ బాబు అంటే వెంకీ బాబు అని అర్థం. ఇక బంగారం అంటే పసిడి వర్ణంతో ధగధగలాడే నయనతార అని అర్థం. వీళ్లిద్దరూ కలిసి ప్రస్తుతం బాబు బంగారం అనే సినిమా చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఈమధ్యే విడుదలైంది. ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా దాదాపు కంప్లీట్ అయింది. తాజా సమాచారం ప్రకారం… బాబు బంగారం సినిమాకు సంబంధించి తన పార్ట్ మొత్తం కంప్లీట్ చేసింది నయనతార. ఏకథాటిగా ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించిన నయనతార… పాటలతో పాటు టాకీ పార్టు మొత్తం పూర్తిచేసింది. ఇప్పటికే ఒప్పుకున్న తమిళ సినిమాలకు కాల్షీట్లు ఎడ్జస్ట్ చేయాలి కాబట్టి.. వెంకీ సినిమాను త్వరగా పూర్తిచేసింది. ప్రస్తుతానికి వెంకీకి సంబంధించిన కొన్ని ఫైట్ సీక్వెన్సులు, డైలాగు పార్ట్ మాత్రమే మిగిలింది. ఈ నెలలోనే సినిమా ఆడియోను విడుదల చేయాలనుకుంటున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చేనెల 15న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.