ఆ కిక్కే అదుర్స్ ట‌…! 

ఒక‌ప్పుడు  వేదిక‌ల‌పై  హీరోయిన్స్  ఆడిపాడ‌టం  చాల త‌క్కువుగా ఉండేది.  కేవ‌లం  ఆఫ‌ర్స్ లేని వాళ్లు మాత్ర‌మే అలా ఆడి పాడుతుంటార‌నే ఒక న‌మ్మ‌కం ఉండేది. క‌ట్ చేస్తే ప‌రిస్థితి మారింది. చాన్స్ వ‌స్తే స్టార్ హీరోయిన్స్  సైతం  ఆడి పాడ‌టానికి  సై అంటున్నారు. ఈ విష‌యంలో హాట్ హీరోయిన్  ర‌కుల్ ప్రీతిసింగ్ అయితే  ..వేదిక మీద  ల‌య‌బ‌ద్ద‌మైన శ‌బ్దం వినిపిస్తుంటే డ్యాన్స్ చేస్తుంటే.. ఆ కిక్కే వేరు అంటోంది.  సినిమాలో అయితే త‌ను చేసిన డ్యాన్స్ చూసుకోవ‌డానికి   రిలీజ్ అయ్యే వ‌ర‌కు వెయిట్ చేయాలి. అదే  వేదిక‌ల‌మీద అయితే  ఆడియ‌న్స్ స్పంద‌న వెంట‌నే తెలిసిపోతుంది అంటోంది. ప్రేక్ష‌కులు స్పందించి కొట్టె చ‌ప్ప‌ట్ల‌లో ఒక కిక్ వుంటుంది. దాని కోసం మ‌ళ్లీ మ‌ళ్లీ వేదిక ఎక్కి చిందేయాల‌నిపిస్తుంద‌ట‌.  ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ధ్రువ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.