ఈ హాట్ జోడీ త్వరలోనే విడిపోనుందట…?

బాలీవుడ్ స్టార్ కపుల్ అంటూ అంతా ముచ్చటపడ్డారు. ఇప్పటికీ వాళ్లకు అదే క్రేజ్ ఉంది. కాకపోతే…వాళ్ల వైవాహిక బంధమే ఇప్పుడు డైలమాలో పడింది. అవును.. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ మధ్య ఇప్పుడు అగాధం పెరిగిందంటున్నారు బాలీవుడ్ జనాలు. ఒకప్పుడు ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈజంట ఇప్పుడు విడిపోవడానికి మొగ్గుచూపుతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.  
కి అండ్ క సినిమా హీరో అర్జున్ కపూర్ తో అర్థరాత్రిళ్ల వరకూ ఫోన్ లో టచ్ లో ఉండటం సైఫ్ కు చిరాకు తెప్పించింది. అతనితో మాట్లాడవద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడట. మరీ ముఖ్యంగా సినిమాలు ఆపేయమని కూడా సూచించాడట. పెళ్లికి ముందు సినిమాల్లో నటించడానికి అభ్యంతరం లేదని చెప్పి, ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పమంటే ఎలా అంటూ బెబో రివర్స్ లో ప్రశ్నించేసరికి వివాదం కాస్త ముదిరిందని తెలుస్తోంది. దీనికి తోడు సైఫ్ ఎవరితోనైతే మాట్లాడొద్దని చెప్పాడో… ఆ అర్జున్ కపూర్ అనే హీరోతోనే బెబో మరో సినిమాకు కమిటైనట్టు తెలుస్తోంది.
దీంతో సైఫ్ కు కోపం మరింత పెరిగిపోయిందని… ప్రస్తుతం వీళ్లిద్దరూ ఒకే అపార్ట్ మెంట్ లో ఉండడం లేదని బాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై రియాక్ట్ అవ్వడానికి సైఫ్ అందుబాటులో లేడు. కానీ కరీనా మాత్రం ఈ ప్రచారంపై కాస్త అటుఇటుగా సమాధానం ఇచ్చివెళ్లిపోయింది. కొంత నిజం, మరికొంత అబద్ధం అన్నట్టుగా మాట్లాడింది.