ఇక రైలు ప్ర‌యాణికుల‌కు నాణ్య‌మైన ఆహారం

త‌మ‌కు రైళ్ల‌లో నాణ్య‌మైన ఆహారం అంద‌డం లేద‌ని వ‌స్తున్న ఫిర్యాదుల‌ను తొల‌గించ‌డానికి రైల్వే శాఖ న‌డుం బిగించింది. ఇందులో భాగంగానే ఆహారం, పానీయాల విశ్లేష‌ణ ప్యాకేజింగ్‌కు సంబంధించి సాంకేతిక‌తను బ‌దిలీ చేసుకోవ‌డానికి గానూ ఢిఫెన్స్ ఫుడ్ రీసెర్చి ల్యాబ‌రేట‌రీ (డీఎఫ్ ఆర్ ఎల్‌)తో  ఐఆర్‌సీటీసీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 
డీఆర్‌డీవో రాకేశ్‌కుమార్ శ‌ర్మ సంత‌కాలు చేశారు. ఆహారాన్ని ప్యాక్ చేయ‌డానికి ఉప‌యోగించే అతిసున్నిత‌మైన పాలిమెరిక్ క‌వ‌ర్లు త‌యారీలో డీఆర్‌డీవో దేశంలో ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. ఆ క‌వ‌ర్ల‌ను ఆహారంతో పాటు తిన‌వ‌చ్చు. అలా తిన‌డం ఇష్టం లేక‌పోతే వేడి నీరు లేదా నీటి ఆవిరితో వాటిని క‌రిగించ‌వచ్చు. ప్ర‌స్తుతం మార్కెట్లో వ‌స్తున్న ప్యాకేజింగ్‌తో పోలిస్తే ఇవి ఎంతో ఉప‌యోగ‌క‌రం.జులై మొద‌టి వారం నాటికి నాణ్య‌మైన ఆహారాన్ని స‌ర‌ఫ‌రా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.