పచ్చతమ్ముళ్ల పైత్యం ఆషామాషీగా లేదే!

అవకాశమే ఉంటే పంచభూతాలపైనా పచ్చరంగు వేసేలాఉన్నారు టీడీపీ తమ్ముళ్లు. టీడీపీ ప్రచారానికి ఇప్పటికే డజనుకు పైగా టీవీ ఛానళ్లు, మరికొన్ని పత్రికలు కర్మాగారంలో కార్మికుల్లా కష్టపడుతున్నాయి. అది చాలదన్నట్టు గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుతమ్ముళ్లు ఒక అడుగు ముందుకేశారు. వారు చేసిన పనిని చూసి ప్రకృతి ప్రేమికులు సైతం దిగ్ర్భాంతి చెందుతున్నారు.

kodela నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వరకు దాదాపు 20 కి.మీ. మేర రోడ్డుకు ఇరువైపులా ఉండే చెట్లను ప్రచారానికి తమ్ముళ్లు వాడేశారు. ప్రతి చెట్టుకు పచ్చరంగేశారు. జై చంద్రబాబు, జై కోడెల అంటూ కొటేషన్లు రాశారు. అంతేకాదు ఈ కొటేషన్లను ఇనుప రేకులపై రాయించి వాటిని తీసుకెళ్లి చెట్ల మొదళ్లకు మేకులు దించి వేలాడాదీశారు. దశాబ్దాల క్రితం ఎవరో నాటిన చెట్లను కూడా పచ్చప్రచారానికి వాడుకోవడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. సత్తెనపల్లి ప్రాంతంలోని విద్యుత్ స్తంభాలను కూడా వదలడం లేదు. ఎక్కడ చూసినా జై చంద్రబాబు… జై కోడెల అన్న పచ్చరంగు స్లోగన్లే కనిపిస్తున్నాయి. సత్తెనపల్లిలో కోర్టు భవనాల వద్ద మొదలుకుని కాలేజీలు, పోలీస్‌ స్టేషన్లు, ఆస్పత్రుల వరకు అన్ని గోడలపైనా కోడెల, బాబు భజన స్లోగన్లే.

cbn treeప్రకృతిని ప్రేమించండి అని ఒకవైపు చెబుతూనే మరోవైపు చెట్లకు మేకులు కొట్టి పచ్చబోర్డులు వేలాడదీయంపై మీడియా వాచ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఈదర గోపీచంద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల మార్క్ స్వచ్చభారత్ అంటే ఇదేనా అని నిలదీస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల వికృత నిరోధక చట్టం -1997 ప్రకారం ఈ చర్యలకుపాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతిలో భాగమైన చెట్లను కూడా హింసించే తీరులో ప్రవర్తించిన వారిపై అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే చెట్లకు పచ్చరంగు నుంచి విముక్తి కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Click on Image to Read:

lokesh

mysura-reddy

balakrishna-road-accident-i

lokesh revanth

speaker-kodela

vishals reddy varalakshmi

 

somu-veeraju

dk-aruna

 

kurapati-nagaraju

kodela

undavalli-arun-kumar

roja

paritala-sunitha-prabhakar-

ap-minister

nagachitanya-samantha

c-kalyan-comments

pawan

ys-jagan

jagan-swarupananda-swami

chandrababu-school