జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు, ఏపీ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు

టీవీ చర్చాకార్యక్రమంలో చంద్రబాబు, టీడీపీ పక్షాన ఎంతదూరమైనా వాదించే వ్యక్తిగా గుర్తింపు పొందిన మానసిక విశ్లేషకుడు నరసింహరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉదయం టీవీ5 చర్చాకార్యక్రమంలో పాల్గొన్న నరసింహరావు ఉద్యోగులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ నుంచి ఉద్యోగులు అమరావతి తరలివెళ్లడం మంచిపరిణామమని చెప్పిన ఆయన… ఇకపై అక్కడ ఉద్యోగులు చచ్చినట్టుపనిచేస్తారన్నారు. హైదరాబాద్‌లో ఇంతకాలం ఉండడం వల్ల సొంత పనులు, పక్క వ్యాపకాలు ఉద్యోగులకు ఎక్కువైపోయాయని చెప్పారు. ఇప్పుడు సిటీకి దూరంగా పనిచేయడం వల్ల వారి ప్రవర్తనలోనూ మార్పు వస్తుందన్నారు. బయట తిరిగే అవకాశం ఉండదు కాబట్టి చచ్చినట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగులు పనిచేస్తారన్నారు. అసలు ఉద్యోగుల వల్ల ఏం ఉపయోగం ఉందని ప్రశ్నించారు. వారు చేసే ఘనకార్యాలు ఏమీ లేవన్నారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీవాడి విధానమే ఇప్పటికీ నడుస్తోందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు పెంచడం అంటే దేశాన్ని దోచివారికి పెట్టడంతో సమానమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత పనికిమాలిన బ్యూరోక్రసి ప్రపంచంలో ఎక్కడా ఉండదన్నారు.

జగన్‌ ఆస్తుల అటాచ్‌పైనా నరసింహరావు స్పందించారు. ఎవరైనా తప్పుచేస్తే సిగ్గుతో ఇంటి నుంచి కూడా బయటకు రారని… జగన్ మాత్రం సిగ్గులేకుండా నవ్వుతూ తిరుగుతున్నారని నరసింహారావు ఊగిపోయారు. సత్యం రామలింగరాజు, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వారు జైలు నుంచి బయటకు వచ్చాక ఎక్కడా కనిపించడం లేదని… జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆక్రోశించారు. అయితే ఈ మేధావి తీరుపై విమర్శలు కూడా గట్టిగానే వస్తున్నాయి. ఆస్తులు అటాచ్‌ అయినందున జగన్ సిగ్గుపడాలనంటున్నా ఈమేధావి … ఆడియో, వీడియో టేపుల్లో బ్రీఫ్డ్‌ మీ అంటూ దొరికిపోయిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏలడం మాత్రం సూపర్ అంటుంటారు. రెడ్ హ్యాండెడ్‌గా క్యాష్‌తో దొరికిపోయిన రేవంత్ రెడ్డిని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను చేసినప్పుడు కూడా ఇలాంటి మేధావులకు అది తప్పుగా అనిపించదు. వందల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన సుజనాచౌదరి కేంద్రమంత్రిగా ఉంటే మాత్రం తప్పుగా అనిపించదు. అయినా ఇలాంటి వారు మేధావులుగా ఉదయమే వచ్చి జనం చెవిలో పూలు పెట్టడం కంటే టీడీపీలో చేరితే జనానికి కూడా తికమక లేకుండా చేసిన వారవుతారు కదా… అంటున్నారు ఉద్యోగులు, వైసీపీ అభిమానులు.

Click on Image to Read:

uma-shankar-goud

ys-jagan-case

ys-jagan-ed

 

kodela-advertisements

lokesh

mysura-reddy

 

lokesh revanth

speaker-kodela

vishals reddy varalakshmi