మళ్లీ తిరుమలేశుడిని చేతిలో పెట్టారు…

ఎప్పటిలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, రాజ్‌నాథ్‌ సింగ్, ఉమాభారతితో సమావేశమయ్యారు. అరుణ్‌ జైట్లీని కలిసి సీఎం ఆర్థిక లోటు, పారిశ్రామిక రాయితీలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు తదితరల అంశాలపై చర్చించారని మీడియాకు తెలియజేశారు. అమరావతి స్విస్‌ చాలెంజ్ విధానంపై దుమారం రేగుతున్న వేళ ఆ విషయంపై అరుణ్‌ జైట్లీకి చంద్రబాబుకు వివరణ ఇచ్చారని తెలుస్తోంది.

కేంద్రమంత్రులను కలిసిన చంద్రబాబు ఎప్పటిలాగే వారి చేతితో వెంకటేశ్వరస్వామి ఫొటో పెట్టారు. ఇలా చేయడం చంద్రబాబుకు ఒక సెంటిమెంట్‌ అని చెబుతుంటారు. వెంకన్న ప్రసాదం, ఫొటో తీసుకెళ్లి ఎదుటివారి చేతిలో పెడితే ఇక వారినుంచి నెగిటివ్‌ స్పందన ఉండదని అందుకే బాబు ఇలాచేస్తుంటారని చెబుతారు. ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత ప్రధానిని కలిసిన సమయంలోనూ చంద్రబాబు ఇదే తరహాలో తిరుమల లడ్డును మోదీ చేతుల్లో పెట్టి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకున్నారని చెబుతుంటారు. ఓటుకు నోటు కేసు విషయంలో ప్రధానిని కలిసే సమయంలో వెంకన్న ప్రసాదం వాడుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఏదీ ఏమైనా చంద్రబాబు సెంటిమెంట్‌ వల్లనైనా స్టేట్‌కు మంచి జరిగితే బాగానే ఉటుంది.

Click on Image to Read:

kurnool-kota

ysrcp-mla

ap NCAER report

bjp-leader

sakshi

tdp-bjp-andhrapradesh

archakudu

jc-diwakar-reddy

narasimha-rao-on-jaga

ys-jagan-case

uma-shankar-goud

ys-jagan-ed

hyderbad-isis-militence

kodela-advertisements

lokesh

speaker-kodela

vishals reddy varalakshmi