స్వ‌యం ప్రోత్స‌హంతో ప్ర‌తిభ‌కు ప‌రుగులు

మాన‌సికప‌ర‌మైన ప్రోత్సాహం, ప్రేర‌ణ‌తో మ‌నుషుల్లో ప్ర‌తిభా సామ‌ర్థ్యాన్ని మెగురు ప‌ర్చ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు.నేను బాగా ప‌ని చేస్తాను అని మీకు మీరే ప్రోత్స‌హించుకుంటే మీకిచ్చిన ప‌నిని మ‌రింత మెరుగ్గా చేయ‌గ‌ల‌ర‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మ‌నుషుల్లో ప్ర‌తిభానైపుణ్యాల ప్ర‌భావాన్ని ప‌రిశీలించేందుకు 44 వేల మందిపై అధ్య‌యనం చేప‌ట్టారు. ఈ సారి నేను బాగా ప‌ని చేస్తాను అని స్వీయ సంభాష‌ణ చేసే వారు మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌రిచిన‌ట్టు ప‌రిశోధ‌కులు గుర్తించారు. బీబీసీల్యాచాతో క‌లిసి ఫ్రొపెస‌ర్ ఆండ్రులేన్ చేప‌ట్టిన ఈ ప‌రిశోధ‌న వివ‌రాల‌ను ఫ్రాంటియెర్స్ ఇన్ సైకాల‌జీ అనే ప‌త్రిక‌లో ప్ర‌చురించారు. ఇలా స్వ‌యం ప్రోత్సాహం చేసుకున్న వారు జీవితంలో ఉన్న‌త  స్థితికి చేరుకునేందుకు వ‌డి వ‌డిగా అడుగులు వేస్తార‌ని ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు.