నేను లోకల్ అంటున్న నాని

నాని పట్టిందల్లా బంగారం అవుతోంది ఈమధ్య భలే భలేమగాడివోయ్ సినిమా నుంచి తాజాగా వచ్చిన జంటిల్ మన్ వరకు ప్రతి మూవీతో సరికొత్త రికార్డులు తిరగరాస్తూనే ఉన్నాడు నాని. స్టోరీ సెలక్షన్ లో తనకుతానే సాటి అని నిరూపించుకుంటున్నాడు. జంటిల్ మన్ సినిమా 3వ వారం లోకి ఎంటరైంది. ఈ రెండు వారాలు ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేసిన నాని, ఇప్పుడు మరో ప్రాజెక్టు పనిలో బిజీ అయిపోయాడు. ‘సినిమా చూపిస్త మావ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న త్రినాథ్ రావు దర్శకత్వంలో…. దిల్ రాజు బ్యానర్ పై ఓ సినిమా చేయడానికి నాని రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు ‘నేను లోకల్’ అనే క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ కూడా నాని స్టయిల్ లోనే చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఈ మూవీతో పాటు ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమా మొదలుపెట్టేశాడు నాని. ఈ సినిమాకు ‘మజ్ను’ అనే టైటిల్ ను తాజాగా ఖరారు చేశారు. ఇలా టైటిల్స్ తోనే తన సినిమాలకు హైప్ తీసుకొస్తున్నాడు నేచురల్ స్టార్ నాని.