నా భర్త బతికి ఉంటే ఇలా ధైర్యం చేసేవారా?

దర్శకుడు రాంగోపాల్ వర్మ, ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్‌పై స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి మండిపడ్డారు. రాంగోపాల్ వర్మ తనను మోసం చేశారని ఆరోపించారు. వీరప్పన్‌ జీవితం ఆధారంగా వర్మ తెరకెక్కించిన చిత్రంలో అన్ని అబద్దాలే ఉన్నాయని ఆమె విమర్శించారు. వీరప్పన్ జీవితానికి, చిత్రానికి ఎలాంటి పొంతన లేదన్నారు. ఈ చిత్రాన్ని ఎవరూ చూడవద్దని కోరారు. తమిళంలో విల్లాది విల్లన్ వీరప్పన్ పేరుతో శుక్రవారం చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా ముత్తులక్ష్మి మీడియా ముందుకు వచ్చారు. హిందీలో అని చెప్పి ఇప్పుడు అన్ని భాషల్లో విడుదల చేసే పనిలో పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరప్పన్ గురించి వర్మకు ఏం తెలుసని ఇలా సినిమా తీశారంటూ మండిపడ్డారు.

వీరప్పన్ 36ఏళ్లు అజ్ఞాతంలో ఉండిపోవడానికి దారి తీసిన పరిణామాలు, పరిస్థితులు తనకు మాత్రమే తెలుసన్నారు. తాను నాలుగేళ్లపాటు వీరప్పన్‌తో కలిసి ఉన్నానని ఆ సమయంలో ఆయన గురించి అనేక విషయాలు తెలిశాయన్నారు. వీరప్పన్ నిజజీవితాన్ని సినిమాగా తీసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని… అందుకు రాజకీయ నాయకులు, పోలీసుల బెదిరింపులే కారణమన్నారు. అయితే త్వరలోనే వీరప్పన్ నిజజీవితాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారామె. తన భర్తను పట్టుకునే క్రమంలో పోలీసులు ఎంతో మంది మహిళలపై అత్యాచారాలు చేశారని…కానీ తన భర్త ఎప్పుడూ అలాంటి దారుణాలకు ఒడిగట్టలేదని చెప్పారు ముత్తులక్ష్మి.

వీరప్పన్‌ను ఎన్‌కౌంటర్‌ చేసిన విజయ్‌కుమార్ ”ద లాస్ట్ ఎన్‌కౌంటర్‌” పేరుతో పుస్తకాన్ని రచిస్తుండడంపైనా ముత్తులక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. . వీరప్పన్‌ను పట్టుకునేందుకు విజయకుమార్ శ్రమించిందేమీ లేదు అని, విజయకుమార్‌ కంటే ముందే ఎందరో డీఎస్పీలు, ఎస్పీలు, డీజీపీ వంటి అధికారులు తీవ్రంగా శ్రమించారన్నారు. అసలు వీరప్పన్‌ను నిజంగా చంపిన విధానాన్ని వివరించే దమ్ము విజయ్‌కుమార్‌కు ఉందా అని ప్రశ్నించారు. ముందు విషప్రయోగం చేసి ఆ తర్వాత చంపిన విషయాన్ని రాసే ధైర్యం ఉందా అని నిలదీశారు. తన భర్త బతికే ఉంటే వీరంతా ఇలాంటి వేషాలు వేసేవారా అని ముత్తులక్ష్మి మండిపడ్డారు.

Click on Image to Read:

ramzan-thofa-ghee

mla-raghurami-reddy

kurnool-kota

ap NCAER report

ktr twitter

arun-jaitly-chandrababu-mee

jc-diwakar-reddy

narasimha-rao-on-jaga

ys-jagan-case