కేశినేని అసలు ఉద్దేశం ఏమిటంటే? ఆయనకు ఆ ధైర్యం ఎక్కడిదంటే…

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పీఠాధిపతులను గానీ, ఆలయ నిర్వాహకులను గానీ సంప్రదించకుండా రాత్రికిరాత్రి వెళ్లి దాదాపు 40 ఆలయాలను నేలమట్టం చేసిన చంద్రబాబు ప్రభుత్వం… ఇప్పుడా చర్యను సమర్ధించుకునే పనిలో చాలా దూరమే వెళ్తోంది. ఇందులో భాగంగా ఇలాంటి పాపాలు మేమే కాదు మోదీ కూడా చేశారు అన్నట్టుగా చాటిచెప్పే ప్రయత్నంచేయడం చర్చనీయాంశమైంది. కేశినేని వ్యాఖ్యలు ఏపీలో బీజేపీ అనుభవిస్తున్న బానిసత్వానికి నిదర్శనంగా కొందరు భావిస్తున్నారు. ఏపీ బీజేపీని శాసిస్తున్న కొందరు కీలక వ్యక్తులు చంద్రబాబుకు తొత్తులుగా మారడం వల్లే టీడీపీ నేతలు ఇలా రెచ్చిపోతున్నారని వాపోతున్నారు.

ఆలయాలు ఎందుకు కూల్చేశారని హిందువులు, వారితో పాటు ఏపీ బీజేపీలో చంద్రబాబు వ్యతిరేకవర్గంగా ముద్రపడిన కొందరు నేతలు ఆందోళన చేస్తున్న తరుణంలో కేశినేని నాని విచిత్రంగా మోదీని తెరపైకి తెచ్చారు. ఏం మోదీ ఆలయాలు కూల్చలేదా. ఒక్క అహ్మదబాద్‌లోనే 80 ఆలయాలను కూల్చేశారు. కావాలంటే వివరాలు ఇవిగో అంటూ కాగితాలను ప్రెస్‌మీట్ పెట్టి చూపించడం చర్చనీయాంశమైంది. బీజేపీ రాష్ట్రాలైన రాజస్థాన్, మహారాష్ట్రలోనూ ఆలయాలు కూల్చారని కూడా నాని ఆరోపించారు. ఎవరినీ సంప్రదించకుండా అర్థరాత్రి ఆలయాలను కూల్చడమే కాకుండా ఇలాంటి పనులు తామొక్కరమె కాదు మోదీ కూడా చేశారని చెప్పడంపై సిసలైన బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.

గుజరాత్‌లో ఆలయాలను కూల్చినా ఇలా పడగొట్టినట్టు, పరాయి రాజులు దండెత్తివచ్చి హిందూ ఆలయాలను కూల్చిన తరహాలో మోదీ ఎక్కడా చేయలేదని బీజేపీ నేతలు అంటున్నారు. ఆలయనిర్వాహకులను సంప్రదించి… ప్రత్యామ్నాయ స్థలాలు చూపించిన తర్వాతే గుజరాత్‌ ప్రభుత్వం ఆలయాలను తొలగించిందని చెబుతున్నారు. ఆ విషయం చెప్పకుండా విజయవాడలో ఆలయాల కూల్చివేత పాపాన్ని తెలివిగా మోదీకి కూడా అంటించే ప్రయత్నం చేయడం ఏమిటని మండిపడుతున్నారు. మరికొందరు బీజేపీ నేతలు … ఈ పరిస్థితి రావడానికి ఏపీ బీజేపీలోని కొన్ని శక్తులే కారణమంటున్నారు.

ఆలయాల కూల్చివేతను తీవ్రంగా వ్యతిరేకించాల్సిందిపోయి… ప్రత్నామ్నాయ స్థలాలు ప్రభుత్వం ఇస్తుందట అంటూ సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు చేప్పడాన్ని కూడా వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎంపీగా ఉన్న కేశినేని నాని ప్రెస్‌మీట్ పెట్టి మరీ మోదీ కూడా ఆలయాలను కూల్చిన వ్యక్తే అని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం ఎందుకు చేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు… మీరొక్కరే హిందూధర్మపరిరక్షకులన్నట్టుగా బిల్డప్‌ ఇవ్వడం మానుకోండి అని నేరుగా బీజేపీని ఉద్దేశించి కేశినేని చేసిన వ్యాఖ్యలు కమలనాథుల్లో మరింత మంట రాజేస్తున్నాయి. అయినా మోదీ ఆలయాలు కూల్చారు కాబట్టి ఈ దేశంలో ఇక ఎవరు ఆ పని చేసినా తప్పు కాదన్నది టీడీపీ నేతల అభిప్రాయం కాబోలు. హిందూమతానికి మోదీ బ్రాండ్ అంబాసిడర్ కాదు… చంద్రబాబు అస్సలు కాదు… ఆ విషయాన్ని మాత్రం టీడీపీ నేతలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది.

Click on Image to Read:

shiva swamy

jaleel-khan-tdp

Gali-Muddu-Krishnama-Naidu

kanna-laxminarayana-vs--bud

Chinna Jeeyar

nagachitanya-samantha

tdp-incharge

jagan-power-plant

kodela

buggana-rajendranath-reddy-

mla-raghurami-reddy

american-telugu-association

ysrcp MLA's

ramzan-thofa-ghee

chandrbabu-naidu

rgv

kurnool-kota

ap NCAER report

ktr twitter

jc-diwakar-reddy