నాగచైతన్య, సమంత పెళ్లికి ముహూర్తం ఖరారు…

హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత మధ్య ప్రేమ నడుస్తోందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. అయితే వాటిని నిజం చేస్తూ నాగచైతన్య, సమంత ఒకటి కాబోతున్నారు. డిసెంబర్‌లో వీరి పెళ్లి జరగనుందని ఒక ప్రముఖ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. వీరి పెళ్లికి రెండు కుటుంబాల వారు కూడా అంగీకరించారట.

అఖిల్‌ పెళ్లి కూడా అతడి గర్ల్‌ఫ్రెండ్ శ్రియాభూపాల్‌తో అదే సమయంలో జరగనుందని పత్రిక కథనం. తన సన్నిహితుల వద్ద నాగార్జున కూడా ఈ విషయాన్ని చెప్పారట. అయితే పెళ్లికి సంబంధించిన గుడ్‌ న్యూస్ తన కుమారులే బయటకు చెబితే బాగుంటుందని నాగ్ వ్యాఖ్యానించారు. నాగ చైతన్య, సమంత ”ఏ మాయ చేశావె” సినిమాలో తొలుత కలిసి నటించారు. ఆ తర్వాత ”ఆటోనగర్ సూర్య”, ”మనం” చిత్రాల్లోనూ నటించారు. కొద్దికాలంగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నారు. మొత్తం మీద నాగ చైతన్య కూడా తండ్రి దారిలోనే నటిని వివాహం చేసుకోబోతున్నారన్న మాట.

Click on Image to Read:

tdp-incharge

jagan-power-plant

kodela

buggana-rajendranath-reddy-

mla-raghurami-reddy

american-telugu-association

ysrcp MLA's

ramzan-thofa-ghee

chandrbabu-naidu

rgv

kurnool-kota

ap NCAER report

ktr twitter

jc-diwakar-reddy