కొట్టుకున్న భూమా, గంగుల వర్గీయులు… కంగుతిన్న కామినేని

నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల టీడీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. తాజాగా మరోసారి భూమా నాగిరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తలపడ్డారు. మంత్రి కామినేని శ్రీనివాస్‌ సమక్షంలోనే కొట్టుకున్నారు. కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. రుద్రవరంలో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ చేసేందుకు మంత్రి కామినేని వచ్చారు.

కార్యక్రమానికి ఇరు వర్గాలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో మాటమాట పెరిగి రెండు వర్గాలు తలపడ్డాయి. ఈ సీన్‌ చూసి మంత్రి కామినేని కంగుతిన్నారు. సర్ధిచెప్పేందుకు ఆయన ప్రయత్నించినా ఎవరూ లెక్కచేయలేదని తెలుస్తోంది. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.  భూమానాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియలు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీలో వార్ మొదలైంది.

click on image to read-

tdp-naidu

amaravathi-building

Palle-Raghunatha-Reddy

jagan-gottipati

cbn-survy

amaravathi-chandrababu-naid

lokesh-focus-on-teachers

chandrababu-naidu

gottipati-ravikumar

kodela

vijaya-sai-reddy

chiru-kodanda-ram-reddy

chandrababu-pitani-ke-krish

adireddy-apparao

narayana

chandrababu-ranks

bhumaka-karunakar-reddy

Defected mla Budda rajashekar reddy

chandrababu-survey

ysr-jayanthi

chandrababu-on-pulivendula

devineni-uma