భూలోక సుంద‌రి త‌మన్నా!

అపురూపమైన‌ సౌంద‌ర్య రాశి త‌మ‌న్నాను భూలోక సుంద‌రిగా కీర్తిస్తోంది పురుషుల వెబ్ మ్యాగ‌జైన్ మెన్స్ ఎక్స్‌పీ. అందం అంటే ఎవ‌రి ప్ర‌మాణాలు వారికుంటాయి. దేశానికో రూపు రేఖ‌ను అందంగా ప‌రిగ‌ణిస్తుంటారు. భిన్నమైన అభిరుచుల ప్ర‌పంచంలో ఏ సుంద‌రాంగికి ఎక్కువ ఆద‌ర‌ణ ఉందో గుర్తించేందుకు పురుష ప్ర‌పంచాన్ని ప‌లుక‌రించింది గేమ‌ర్ అనే సంస్థ‌. ఆన్‌లైన్ చాటింగ్ ద్వారా అమెరికా, కెన‌డా, యునైటెడ్ కింగ్‌డ‌మ్ మొద‌లైన దేశాల వారు అత్య‌ధికంగా పాల్గొన్న ఈ స‌ర్వేలో స్వ‌దేశీ సుంద‌రాంగుల‌ను కాద‌ని, త‌మ‌న్నాకు ఓటేశారు. తాము చ‌ద‌విన‌, చూసిన సుంద‌రాంగుల్లో ఎవరికి ఏ ర్యాంక్ ఇస్తార‌ని గేమ‌ర్ సంస్థ‌కు త‌మ‌న్నాకే తొలిస్థానం అని కుర్ర‌కారు తేల్చేసింది. గేమ‌ర్ క‌మ్యునిటీలో నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో 30 శాతం మంది 35 ఏళ్ల‌కు పైబ‌డ్డ వాళ్లున్నారు. ఇక 60 శాతం మంది 16 ఏళ్లలోపు వాళ్లే. విదేశీ టీనేజ‌ర్లలో మ‌న మిల్కీ బ్యూటీకి ఎంత ఫాలోయిందో మెన్స్ ఎక్స్‌పీ లిస్టే చెబుతోంది.