మొక్కే క‌దా అని పీకేస్తే.. !

మొక్కే క‌దా అని పీకేస్తే.. ఇది ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో బాగా ఆద‌ర‌ణ పొందిన డైలాగ్‌. ఇప్పుడు అదే మొక్క కోసం తెలంగాణ‌లో చేప‌ట్టిన‌ హ‌రిత‌హారం కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున స్పంద‌న వ‌స్తోంది. సోమ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లు, విద్యార్థులు, సెల‌బ్రిటీలు, ఐటీ కంపెనీల ఉద్యోగులు,  భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. సీఎం స్వ‌యంగా నిమ్స్ ప్రాంగ‌ణంలో మొక్క నాటారు. హ‌రిత‌హారాన్ని ఉద్య‌మంలా చేప‌ట్టాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపున‌కు ప్ర‌జ‌ల నుంచి చ‌క్క‌టి స్పంద‌న ల‌భిస్తోంది. ఒక్క హైద‌రాబాద్‌లో 29 ల‌క్ష‌ల మొక్క‌లునాటారు. వాస్త‌వానికి రాజ‌ధానిలో 25 ల‌క్ష‌ల మొక్క‌లు మాత్ర‌మే టార్గెట్ గా పెట్టుకున్నారు. అద‌నంగా మ‌రో 4 ల‌క్ష‌లు నాట‌డం మ‌రో రికార్డు.
తెలంగాణ స‌ర్కారు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మం కావ‌డంతో దీనిపై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. అందుకే వీటి ర‌క్ష‌ణ‌కు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కేవ‌లం మొక్క‌లు నాటి చేతులు దులుపుకుందామంటే స‌రిపోద‌ని.. అది పెరిగే వ‌ర‌కు అంద‌రూ బాధ్య‌త వ‌హించాల్సిందేన‌ని కేసీఆర్‌ స్ప‌ష్టం చేశారు. ఇందుకోసం అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. నాటిన మొక్క‌ల రక్ష‌ణ‌, నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను స్థానిక అధికారులు, స‌ర్పంచులు, ఎంపీటీసీ, ఎంపీడీవో, త‌హ‌సీల్దార్లు చూసుకోవాల‌ని ఆదేశించారు. మొక్క‌ల ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు ఎలా జ‌రుగుతున్నాయ‌న్న విష‌యంలో నిత్యం నిఘా ఉంటుంద‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు ర‌హ‌స్య నివేదిక‌లు త‌మ‌కు వ‌స్తాయ‌ని, కాబ‌ట్టి ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. మొక్కే క‌దా అని.. సులువుగా తీస్తే.. క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. ఇక‌పోతే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కూడా పనిలోపనిగా అధికారుల‌ను హెచ్చరించారు.. మ‌ళ్లీ 6 నెల‌ల త‌రువాత వ‌స్తా.. నాటిన మొక్క‌లు ఏపుగా పెర‌గాలి.. మొక్క‌ల ర‌క్ష‌ణ‌లో అల‌స‌త్వం వ‌ద్దు అని హెచ్చ‌రించారు. మొత్తానికి ఇటు గ‌వ‌ర్న‌ర్‌.. అటు సీఎంల హెచ్చ‌రిక‌ల‌తో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

click on image to read-

kavitha-on-chandrababu

tdp-naidu

bhuma-gangula

Palle-Raghunatha-Reddy

jagan-gottipati

amaravathi-chandrababu-naid

lokesh-focus-on-teachers

chandrababu-naidu

gottipati-ravikumar

vijaya-sai-reddy