సబ్బంపై కన్నేశారు…

ఏపీలో తటస్తంగ ఉన్న నాయకులకు డిమాండ్ పెరుగుతోంది. ఎదుటిపార్టీకి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో మాజీ కాంగ్రెస్ నేతలకు గాలాలు వేస్తున్నారు. తాజాగా కొన్ని పార్టీలు అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బంహరిపై కన్నేశాయి. సబ్బంహరిని చేర్చుకునేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీన్నిగమనించిన టీడీపీ కూడా రంగంలోకి దిగుతోంది. అయితే సబ్బం మాత్రం ఈ రెండు పార్టీల విషయంలోనూ సానుకూలంగా లేరని చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో సబ్బంహరిని చేర్చుకుంటే త్వరలో జరిగే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో చక్రం తిప్పవచ్చని బీజేపీ భావిస్తోంది.

టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఎక్కువ స్థానాలను డిమాండ్ చేయవచ్చని భావిస్తోంది. పార్టీలోకి వచ్చే నేతలను చేర్చుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని అమిత్‌షా కూడా ఆదేశించారని చెబుతున్నారు. అయితే సబ్బంహరికి బీజేపీ గాలం వేస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. టీడీపీలోకి వస్తే మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తామని ఆఫర్ ఇస్తోంది. గతంలోనే సబ్బంను టీడీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఆయన తిరస్కరించారు.

విశాఖ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి టీడీపీ సబ్బం కోసం తీవ్రంగాప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు ఆయనను సంప్రదించారని సమాచారం. అయితే సబ్బం హరి మాత్రం టీడీపీ, బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు. ఏపీలోపరిపాలన మొత్తం గాడితప్పడం, దేశంలోనే నెంబర్‌ 1 అవినీతి రాష్ట్రంగా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్‌ సంస్థ కూడా ధృవీకరించిన నేపథ్యంలో టీడీపీలో చేరితే ప్రజల్లో తన వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందని సబ్బంహరి భావిస్తున్నారని చెబుతున్నారు. పైగా టీడీపీలో తాను ఇమడలేనని ఆయన భావిస్తున్నారట. ఇక మతతత్వపార్టీగా ముద్రపడిన బీజేపీలో చేరడం కూడా మంచిది కాదన్న అభిప్రాయంతో ఉన్నారంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో తనతోపాటు ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గుచూపుతుండడం కూడా సబ్బంను ఆలోచనలో పడేస్తోందంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకుదూరంగా ఉన్న సబ్బం ఎటు మళ్లుతారో చూడాలి.

Click on Image to Read –

r-vidyasagar-rao

ysrcp1

chevi-reddy

babu-movie

ys-jagan-yatra

buggana-rajendranath-reddy

chandrababu-naidu

chandrababu-psyco

vijaya-sai-reddy

buggana-rajendranath-reddy

sujay-krishna-ranga-rao

babu-rank

ys-jagan

Palle-Raghunatha-Reddy

jagan-gottipati