శ్రీ‌వాణి అరెస్టుకు రంగం సిద్ధం!

సీరియ‌ల్ న‌టి శ్రీ‌వాణి రీల్ లైఫ్ తో పాటు రియ‌ల్ లైఫ్‌లోనూ విల‌నేనా? అన్న అనుమానాలు రోజురోజుకు బ‌ల‌ప‌డుతున్నాయి. ఈ  విష‌యంలో శ్రీ‌వాణి ఇచ్చిన ఫిర్యాదు, పోలీసులకు ద‌ర్యాప్తులో తెలిసిన విష‌యాలు ప‌ర‌స్ప‌ర విరుద్ధంగా ఉండ‌టంతో ఆమె ఇబ్బందుల పాల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  
ప‌రిగిలో ఉన్న త‌న వ‌దిన ఇంటిని శ్రీ‌వాణి కూల్చారంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే! అదే స‌మ‌యంలో త‌న‌పైన త‌న వ‌దిన దాడి చేసింద‌ని శ్రీ‌వాణి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇరువ‌ర్గాల ఫిర్యాదులు స్వీక‌రించిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.  శ్రీ‌వాణే త‌న వ‌దిన అనూష‌పై అకార‌ణంగా దాడి చేసింద‌ని తాజాగా పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. శ్రీ‌వాణి త‌న వ‌దిన‌పై దాడి చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని వికారాబాద్ సీఐ నిర్మ‌ల తెలిపారు. ఇరుగుపొరుగు వారు, ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నం ప్ర‌కారం.. శ్రీ‌వాణే కావాల‌ని త‌న వ‌దిన అనూష‌పై దాడి చేసిందని సీఐ వెల్ల‌డించారు. శుక్ర‌వారం పోలీసుల విచార‌ణ‌కు శ్రీ‌వాణి గైర్హాజ‌ర‌య్యారు. రేప‌టిలోగా విచార‌ణ‌కు హాజ‌రుకాకుంటే ఆమెపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. అంటే ఆమె విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోతే..అ రెస్టు త‌ప్ప‌ద‌న్న హెచ్చ‌రిక‌లు పోలీసులు ప‌రోక్షంగా పంపారు.
దీంతో శ్రీ‌వాణి ఉదంతం సోష‌ల్ మీడియాలో, టీవీ ఛాన‌ళ్ల‌లో పెద్ద దుమారంగా మారింది. ఆమె రీల్ లైఫ్‌లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ విలనే అని అనుకుంటున్నారు.  మొత్తానికి నిన్న మొన్న‌టిదాకా త‌న‌పైనే దాడి జ‌రిగిందంటూ.. శ్రీ‌వాణి చెబుతున్న‌వ‌న్నీ క‌ట్టుక‌థ‌లేన‌ని తేలిపోయింది.
Click on Image to Read:
srivani
Karamjeet-Kaur
sania-mirza
chiru
kamal-hasan
samantha-naga-chaitanya-mar
ntr-janatha-garage
chiru-vijayashanti