అలాంటి చోట చావులు కామన్‌… చర్యలుండవు

టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనపై చాలా తేలిగ్గా స్పందించారు. తొక్కిసలాటలు కామన్ అని తేల్చేశారు. రాజమండ్రి వచ్చిన గాలి… లక్షలాది మంది వచ్చేచోట తొక్కిసలాటలు జరగడం అన్నది సాధారణమేనని చెప్పారు. లక్షలాది మంది భక్తులు వచ్చే చోట అపశ్రుతులు జరుగుతుంటాయని వాటిపై రాద్దాంతం చేయడం సరికాదన్నారు.

గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు ఎవరూ బాధ్యులు కాదని… కాబట్టి ఎవరిపైనా ఎలాంటి చర్యలుండవని తేల్చేశారు. త్వరలో కృష్ణా పుష్కరాల లు జరగనున్న నేపథ్యంలో గాలి మాటలు చర్చనీయాంశమయ్యాయి. లక్షలాది మంది వచ్చిన చోట తొక్కిసలాటలు సాధారణమని చెప్పడం ద్వారా కృష్ణా పుష్కరాల నిర్వాహణలోనూ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నా చర్యలుండవని గాలి చెప్పదలుచుకున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది బాధ్యతారాహిత్యమేనంటున్నారు. సిబ్బందిలో నిర్లక్ష్యం పెరిగే ప్రమాదం ఉంటుందంటున్నారు.

Click on Image to Read:

tdp-vijaya-jyothi

revanth-reddy

katti-padmarao-new

srivani

eenadu-story

babu-lokesh

11212

ambati

chandrababu-modi

ysrcp1

sabbam-hari

r-vidyasagar-rao

babu-movie