లోకేష్ మనిషినంటూ ఉన్నతాధికారి లైంగిక వేధింపులు

బెజవాడ దుర్గమ్మ ఆలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులు వణికిపోతున్నారు. దుర్గగుడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మేనేజర్ చంద్రశేఖర్‌ చేస్తున్న లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నారు. చంద్రశేఖర్ పోరు భరించలేక పలువురు మహిళా ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. చంద్రశేఖర్‌పై ఫిర్యాదుచేశారు.

మహిళలు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటి నుంచి చంద్రశేఖర్ మరింత రెచ్చిపోయారు. తనకు లొంగకపోతే ఇకపై ఉద్యోగాల్లో నుంచి తీసివేస్తానంటూ  వేధింపులు మరింత ఎక్కువ చేశారని మహిళా ఉద్యోగులు చెబుతున్నారు. ”నేను నారా లోకేష్‌ మనిషిని, ఆయనే నన్ను ఇక్కడ పెట్టారు. కాబట్టి నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. పోలీసులకు చెప్పినా ఫలితం ఉండదు. కాబట్టి నేను చెప్పినట్టు వింటే ఉద్యోగాలు ఉంటాయి” అంటూ బెదిరిస్తున్నారు. దీంతో మహిళా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కనీసం విచారణ కూడా చేయడం లేదని ఇక తమ మానాలకు దిక్కెవరని వాపోతున్నారు. చంద్రశేఖర్ మాత్రం పనిచేయాల్సిందిగా  చెప్పినందుకే  తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

Click on Image to Read:

c-ramachandraiah

ramcharan-Konda-Vishweshwar

vijayawada beggars question to ap government

srivani

gali-muddu-krishnama-naidu

tdp-vijaya-jyothi

revanth-reddy

katti-padmarao-new

srivani

eenadu-story

babu-lokesh

11212

ambati

chandrababu-modi

ysrcp1

sabbam-hari

r-vidyasagar-rao

babu-movie