ఈమెను ఆంటీ అనగలరా..?

సాధారణంగా పెళ్లయి గ్యాప్ తీసుకున్న తర్వాతే ఎక్కువమంది హీరోయిన్లు రీఎంట్రీ ఇస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రీఎంట్రీ ఇచ్చేవాళ్లంతా ఆంటీలే. అందుకు తగ్గట్టే… పెళ్లయిన తర్వాత తారలు సెలక్ట్ చేసుకునే క్యారెక్టర్లు కూడా అలానే ఉంటాయి. ఇక పెళ్లయి, పిల్లలు కూడా పుడితే వాళ్లు ఇక క్యారెక్టర్ రోల్స్ చేసుకోవడమే. లేదంటే హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ చేసుకోవాలి. కానీ ఈ లెక్కల్ని అందాల తార ఐశ్వర్యరాయ్ తిరగరాస్తోంది. పెళ్లయి ఇన్నేళ్లయినా, ఓ పాపకు జన్మనిచ్చినా… తనలో యవ్వనం ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది ఐష్. పెళ్లయి, పాప పుట్టిన కొత్తలో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ… ఇప్పుడు మళ్లీ తన పదేళ్ల కిందటి లుక్ లోకి వచ్చేసింది. అప్పటికీ ఇప్పటికీ తనలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. తాజాగా కేన్స్ చిత్రోత్సవానికి వెళ్లిన ఐశ్వర్యరాయ్… అక్కడే ఓ కంపెనీకి ఫొటో షూట్ కూడా ఇచ్చింది. అక్కడ క్లిక్ మనిపించినదే ఈ ఫొటో. ఇప్పుడు చెప్పండి.. ఈమెను ఎవరైనా ఆంటీ అనగలరా….?

aishwarya