అతడి వల్లే వ్యవస్థ కుప్పకూలింది… ఏపీ మాజీ సీఎంపై జైరాం ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌ విభజనలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఒక తెలుగు టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సీఎం కిరణ్ కుమార్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్‌ పార్టీ ఆత్మహత్యసదృశ్యమేనని అంగీకరించారు జైరాం. విభజన గురించి సీమాంధ్ర నాయకులకు ముందే తెలుసన్నారు.

రాష్ట్ర విభజన జరగదంటూ కిరణ్‌ కుమార్ రెడ్డి ఆఖరి వరకు సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతూ వచ్చారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వల్లే వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయిందని ఆరోపించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాల వైపు నుంచే రాష్ట్ర విభజన చేయాల్సి వచ్చిందంటూనే .. విభజనలో మొదటి దోషి కిరణ్‌ కుమార్ రెడ్డేనని జైరాం రమేష్ చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే తాను విభజన అంశంపై పుస్తకం రాయాల్సి వచ్చిందన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాన్ని కూడా విభజించాల్సిందేనన్నారు జైరాం. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాగా దెబ్బతినే సరికి ఆ పార్టీకి అసలు విషయం అర్థమైనట్టుగానే ఉంది. అందుకే కాబోలు రాష్ట్ర విభజన కాంగ్రెస్ చేసుకున్న ఆత్మహత్య సదృశ్యమేనని జైరాం రమేష్ చెబుతున్నారు.

Click on Image to Read:

sharma

pattipati-pullarao

kovur-tdp-mla-polam-reddy-s

jv-ramudu

galla-arjun-jayadev

akhil-love-story

ys-jagan-rayapati

tdp-vijaya-jyothi

ramcharan-Konda-Vishweshwar

vijayawada-flyover

revanth-reddy

lokesh

kohli-model-murder

vijayawada beggars question to ap government

srivani

gali-muddu-krishnama-naidu

ysrcp1

r-vidyasagar-rao

babu-movie