మరో లేడీస్ టైలర్ పుట్టుకొచ్చాడు…

రాజేంద్రప్రసాద్-వంశీ కాంబినేషన్ లో వచ్చిన లేడీస్ టైలర్ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయినప్పటికీ… తర్వాతి కాలంలో ది బెస్ట్ మూవీ అనిపించుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తీద్దామని సీనియర్ వంశీ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ వర్కవుట్ మాత్రం కాలేదు. ఫైనల్ గా ఈ సినిమా సీక్వెల్ కు దగ్గుబాటి హీరో దొరికాడు. దగ్గుబాటి వారసుడు, రానా తమ్ముడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ… లేడీస్ టైలర్ సీక్వెల్ ను పట్టాలపైకి తీసుకురావాలని వంశీ భావిస్తున్నాడు. ఈ సినిమాకు ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ అనే టైటిల్ అనుకుంటున్నారు. 
నిజానికి ఈ ప్రాజెక్టును చాన్నాళ్ల కిందటే రవితేజ హీరోగా ప్లాన్ చేశారు. కానీ ఎందుకో అది వర్కవుట్ కాలేదు. తాజాగా రాజ్ తరుణ్ హీరోగా మరోసారి ఈ సీక్వెల్ తెరపైకి వచ్చింది. కానీ అది కూడా ఫైనల్ కాలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా అభిరామ్ పేరు తెరపైకి వచ్చింది. ఈసారి ఇది కచ్చితంగా పట్టాలపైకి వస్తుందని అంతా భావిస్తున్నారు. ఎఁదుకంటే.. అభిరామ్ ఎంట్రీకి ఇదే సరైన సినిమా అని సురేష్ బాబు భావిస్తున్నాడట. పైగా తక్కువ బడ్జెట్ లో ఎంట్రీకి ఇంతకంటే ఉత్తమమైన సినిమా ఉండదని సురేష్ బాబు ఫీలింగ్. సో… అభిరామ్ ఎంట్రీ మూవీ ఇదే కావొచ్చు.